గంటా సంకేతాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ganta srinivasa rao
Updated:  2018-10-02 11:47:09

గంటా సంకేతాలు

ప‌ర్యాట‌క ప‌రంగానే కాకుండా పారిశ్రామిక ఐటీ పెట్టుబ‌డుట‌కు కేరాఫ్ అడ్ర‌స్ మారింది భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం. మ‌హిళా ఓట‌ర్లు ఎక్క‌వ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, యాద‌వ, మ‌త్స్య‌కార, అలాగే రెడ్డి ప్ర‌ధాన కులాలు. ఈ కుల‌స్థులు అభ్య‌ర్థుల గెల‌పు ఓట‌మిల‌ను నిర్ణ‌యిస్తాయి. సంఖ్యాప‌రంగా త‌కువ‌గానే ఉన్నా రాజ‌కీయంగా చక్రం తిప్పుతారు ఇక్క‌డి నాయ‌కులు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీమిలీ ప‌ట్నంలో సైకిలే బ‌లంగా ఉన్నా 2009 ఎన్నికల్లో ప్ర‌జా రాజ్యం ఆవిర్భావంతో సీన్ రివ‌ర్స్ అయింది.
 
ఆ ఎన్నికల్లో పీఆర్‌పీ నుంచి గెలిచిన శ్రీనివాస్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీలో చేరి అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచారు. ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాస్ రావు మంత్రిగా ఉన్నారు. అంతేకాదు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో గెలుపే ల‌క్ష్యంగా చేసుకుని అమ‌లు చేయ‌లేని అనేక హామీలు ఇచ్చారు గంటా . 
 
అయితే గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల్లో మంత్రి ప‌ద‌విలో ఉన్నాకూడా గంటా నియోజ‌క‌వ‌ర్గానికి  నిధులు రాబ‌ట్ట‌డంతో విఫ‌లం అయ్యారు. వేలామంది కార్మికుల జీవితాల‌తో ముడిప‌డ్డ జూట్ మిల్ స‌మ‌స్య ఇంత‌వ‌ర‌కు ప‌రిష్క‌రించ‌లేదు గంటా.  అలాగే రాష్ట్రంలో సంచ‌ల‌నం రేకెత్తిచిన ల్యాండ్ స్కామ్ లో గంటాకు మ‌ర‌క‌లు ప‌డ్డాయి. ఇక  త‌న‌పై ప‌డిన మ‌ర‌కల‌ను తొల‌గించుకునేందుకు మంత్రి గంటా అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌రుకు వ‌స్తున్న త‌రుణంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి తాను పోటీ చేస్తాన‌ని సంకేతాలు ఇస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.