బాబు గంటా ల మ‌ధ్య వార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 15:07:30

బాబు గంటా ల మ‌ధ్య వార్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గరకు వ‌చ్చే కొద్ది అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇక ఇప్ప‌టికే టీడీపీ చెందిన అనేక మంది సీనియ‌ర్ నాయ‌కులు టీడీపీకి గుడ్ బై చెప్పి ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ఆయ‌న‌ను క‌లుకుని వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఇదే క్ర‌మంలో టీడీపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీని వీడుతార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇదే విష‌యంపై ఈ మ‌ధ్య కాలంలో స్వ‌యనా గంటా త‌న స‌న్నిహితుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించార‌ట‌. ఇక తాను త్వ‌ర‌లో పార్టీ మారుబోతున్నాని అందుకు మీ నిర్ణ‌యం కావాల‌ని గంటా తెలిపార‌ట‌. అయితే  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం మంచిదే అని సన్నిహితులు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అవ్వ‌డంతో గంటా త్వ‌ర‌లో టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నార‌ట‌. 
 
అయితే ఈ విష‌యాన్ని తెలుసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గంటాకు మ‌రో మార్గం లేకుండా చేసేందుకు అన్ని వైపుల నుంచి ఉచ్చుబిగిస్తున్నారట‌. ఇక అదే క్ర‌మంలో చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడుతో మంత్రి అవినీతి గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా చేయిస్తున్నార‌ని గంటా అనుచ‌రులు అనుమానిస్తున్నారు. 
 
ఇక ఇదే ఈ విష‌యాన్ని అనుచ‌రులు గంటాకు తెలియ‌చేయ‌డంతో ఆయ‌న‌ తగిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో కూడా చంద్ర‌బాబు, గంటాను చావు దెబ్బ కొట్టేందుకు ఆయ‌న శత్రువు అయిన కొణ‌తాల రామ‌కృష్ణను టీడీపీలోకి తీసుకుని విమ‌ర్శ‌లు చేయించాల‌ని శ‌త విధాలుగా ట్రై చేశారు. అయితే గంటా మాత్రం వారిని కేర్ చేయ‌లేదు.
 
2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు టీడీపీ అధికారంలోకి వస్తే గంటాకు ఉప ముఖ్యమంత్రి ప‌ద‌విని ఇస్తాన‌ని చెప్పారు. కానీ మాట మార్చి ఆ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కేఈ కృష్ణ మూర్తికి ఇచ్చి, గంటాకు విద్యాశాఖ మంత్రి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో చిన‌బుచ్చుకుపోయిన గంటా, మంత్రి ప‌ద‌విలో ఉంటూ అనుక్షణం అవకాశం వస్తే బాబును దెబ్బకొట్టేందుకు నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఎదురు చూస్తూనే ఉన్నార‌ట‌. 
 
అయితే ఈ క్రమంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. ఇక చేసేది ఏమిలేక గంటా పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ ఎన్నిక‌లు కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కుల అంటున్నారు.  మొన్న‌జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌లలాగ ఏపీలో జ‌రిగితే... ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రి అవుతారు అనుకుంటే ఆ మ‌రుక్ష‌ణ‌మే గంటా శ్రీనివాసరావు జ‌న‌సేన లోకి చేరుతారు. కానీ అలాంటి ప‌రిస్థితే లేదు క‌నుక తిరిగి జ‌గ‌న్ హామీ ఇస్తే వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక ఇదే విష‌యాన్ని కూడా వైసీపీ ఎంపీ విజ‌యసాయి రెడ్డి కూడా చెప్ప‌డంతో క‌చ్చితంగా గంటా పార్టీ మారే ఛాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి రాజకీయాల్లో ప్రపంచానికే పాఠాలు చెప్పగల చంద్రబాబుకు నిజంగానే గంటా గుణపాఠం చెప్పగలడా అనే ప్ర‌శ్న ప్ర‌తీ ఒక్క‌రికీ ప్ర‌శ్న‌గానే మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.