త‌న గ్రూప్ తో గంటా కొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 15:04:47

త‌న గ్రూప్ తో గంటా కొత్త ప్లాన్

వైసీపీ విమ‌ర్శ‌ల వ‌ల్ల జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల వ‌ల్ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాను అని ఇటు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.సందోడ్లో స‌డేమియాలా 15 రోజుల్లో ప‌ద‌వి పూర్తి అవుతుంది అన‌గా, తెలుగుదేశం వేసిన స్కెచ్ అట్ట‌ర్ల ప్లాప్ అయి అంద‌రికి తెలిసిపోయింది. ఇక మ‌న‌కు ఎంతో బెట‌ర్ ఛాన్స్ గా ఉంటుంది అని అనుకున్న తెలుగుదేశం పార్టీ, త‌న  ఆస్దాన మీడియాతో ఆర్జే ఫ్లాష్ టీం స‌ర్వే అంటూ ఓ స‌ర్వేని ఏపీలో బ‌య‌ట‌పెట్టింది.
 
ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా18 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల ప‌ల్స్ తీసుకుని ఇదే జ‌నం ప‌ల్స్ అంటే ఎలా అనే ప్ర‌శ్న ఇప్పుడు కొత్తగా లేవ‌నెత్తుతున్నారు.. అయితే ఈ త‌తంగంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఇప్పుడు పెద్ద సెన్సేష‌న్ గా మారారు.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో విశ్వాసం లేదు ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం క‌ష్టం అని భీమిలీ న్యూస్ గా ఈ స‌ర్వే తేల్చింది.. దీంతో మంత్రుల్లో అంద‌రిలో ఆయ‌న‌కంటూ ఓ ఫేమ్ ఉంది సొంత ఆస్ధాన మీడియాలో ఇలా రావ‌డం వెనుక ఎటువంటి కుట్ర‌లు ఉన్నాయా అని ఆయ‌న మ‌ద‌న‌ప‌డుతున్నారు.
 
ముఖ్యంగా గంటా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తారు అని ఇటు ఆయ‌న తెలుగుదేశంలో కూడా కొన‌సాగే ఆస్కారం లేదు అంటూ కొంద‌రు వైర‌ల్ ప్ర‌చారం చేస్తున్నా, అవ‌న్నీ ఒట్టి మాట‌లు అబద్దాలు అవాస్త‌వాలే అని నిన్న సీఎం తో ఆయ‌న మాట్లాడిన త‌ర్వాత తేలిపోయింది... ముఖ్యంగా ఇప్పుడు గంటా త‌న కోట‌రిలో ఉన్న నేత‌ల‌తో స‌మావేశం అయ్యార‌ట‌... ఆయ‌న తెలుగుదేశంలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న‌కంటూ ఓ ఫ్యాన్స్ నాయ‌కులు ఫాలోయింగ్ ఉంది.. ఈ స‌మ‌యంలో ఆయ‌న తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల‌, పార్టీ నుంచి ఆయ‌న కేడ‌ర్ తో స‌హా ఆయ‌న గ్రూపు ఎమ్మెల్యేల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌స్తారు అని ఉత్త‌రాంధ్రాలో వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఉత్త‌రాంధ్రాలో ఆయ‌న వెంట న‌లుగురు ఎమ్మెల్యేలు, విజ‌య‌న‌గ‌రంలో ఓ ఎమ్మెల్యే ఉన్నారు.. ఇటు ఎమ్మెల్యే టిక్కెట్లు ఆయ‌న వ‌ర్గం నుంచి ఆశించే వారిలో మ‌రో ముగ్గురు ఉన్నారు..అలాగే భీమిలి కూడా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో మారాలి అని వేరే సెగ్మెంట్ల నుంచి పోటి చేయాలి అని భావిస్తున్నారు.. ఈ స‌మ‌యంలో ఇటువంటి రిపోర్టు రావ‌డం పై ఆయ‌న కొత్త దారులు చూసుకుంటున్నారు అని అంటున్నారు జిల్లా నాయ‌కులు. మ‌రి గంటా ముందే సీట్ల విష‌యంలో సీఎంతో  ఒప్పందం చేసుకుంటార‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.