గంటా ఉండేదా.. ఊడేదా ! ఈ రోజు తేల‌నుంది..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 13:20:35

గంటా ఉండేదా.. ఊడేదా ! ఈ రోజు తేల‌నుంది..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ‌లం, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌లం ఎంత ఉందో తెలుసుకునేందుకు ప్ర‌ముఖ మీడియా యాజ‌మాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఓ స‌ర్వేను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌ర్వే ప్ర‌కారం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ 110  సీట్ల‌కు పైగా సొంతం చేసుకుంటుందని, ప్ర‌తిప‌క్ష వైసీపీ కేవ‌లం 60 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని చెప్పి రెండు రోజుల‌ పాటు ప్ర‌జ‌ల‌ను షాక్ కు గురి చేసింది.
 
ఇక ఈ స‌ర్వే పై దృష్టి పెట్టిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు వారు నిజంగా స‌ర్వే చేశారా లేక అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేస్తున్నారా అనే విష‌యంపై దృష్టి సాదించింది. ఇక ఫైన‌ల్ గా ఈ స‌ర్వే ఒక బోగ‌స్ స‌ర్వే అని తేల‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 
 
అంతే కాదు టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సొంత నియోజ‌కవ‌ర్గం అయిన భీమిలీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం క‌ష్టత‌రంతో కూడుకున్న‌ద‌ని ఎల్లో మీడియా స‌ర్వేలో బ‌య‌ట‌ప‌డింది. దీంతో మంత్రి మూడు రోజుల నుంచి పార్టీ నాయ‌కుల‌కు దూరంగా ఉంటూ, ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు.
 
దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి మంత్రికి ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి ఆయ‌న‌ను బుజ్జ‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబట్టి అనేక ప‌త్రికలు, రాజ‌కీయ విశ్లేష‌కులు అధికార ప్ర‌తిప‌క్షాల ప‌ట్టు ఏపీలో ఏ మాత్రం ఉందో అన్న‌కోణంలో స‌ర్వేలు నిర్వ‌హిస్తుంటార‌ని వాటిని ప‌ట్టించుకోకూడ‌ద‌ని చంద్ర‌బాబు, గంటాకు ఫోన్లో చెప్పార‌ట‌. అంతే కాదు గ‌తంలో త‌న గురించి కూడా వ్య‌తిరేకంగా వార్తలు ప్ర‌చారం చేశార‌ని వాట‌న్నింటిని ప‌ట్టించుకుపోతూ ఉంటే ప‌రిపాల‌న చేయ‌లేమ‌ని చెప్పార‌ట‌. 
 
కాగా ఈ సర్వే జ‌రుగ‌క ముందు గంటా శ్రీనివాస్ పై కూడా అనేక వార్త‌లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలోపు వైసీపీలో చేరుతార‌ని, ఈ విష‌యంపై గంటా త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌నపై వ‌స్తున్న వార్త‌ల‌పై గంటా చాలా సార్లు స్పందించ‌లేదు. తాజాగా ఎల్లో స‌ర్వే జ‌రిగిన త‌ర్వాత కూడా వైసీపీలో చేరుతారంటూ వార్తలు వ‌చ్చాయి. కానీ ఈ విష‌యంపై కూడా గంటా స్పందించ‌లేదు. 
 
ఇక ఈ రోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విశాఖలో ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఈ కార్య‌క్రామానికి గంటా హాజ‌రు అయితే ఆయ‌నపై వ‌స్తున్న‌ వార్త‌లు ఫేక్ అయిన‌ట్లు. ఒకవేళ‌ హాజ‌రు కాక‌పోతే గంటాపై వ‌స్తున్న వార్తలు నిజం అయిన‌ట్లు, చూడాలి మ‌రి సీఎం స‌భ‌కు గంటా హాజ‌రు అవుతారా లేక డుమ్మా కొడతారా అనేది మ‌రికొద్ది గంటల్లో తేల‌నుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.