ఆ పార్టీ లైన్ క్లియ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:08:24

ఆ పార్టీ లైన్ క్లియ‌ర్

వైసీపీలోకి ఆ మంత్రి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి అనే చ‌ర్చ జ‌రిగింది... త‌ర్వాత జ‌న‌సేన‌లోకి ఆయ‌న వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ‌జ‌రిగింది.. అయితే రెండు పార్టీల్లో, ఆయ‌న ఎంట్రీ ఏ పార్టీలో ఉంటుంది అనే మీమాంశ ప్ర‌తీ ఒక్క‌రికి ఉంది..అయితే ఆయ‌న ఎవ‌రో కాదు మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ఆయ‌న మాత్రం తాను పార్టీ మారేది లేద‌ని తెలియ‌చేశారు..అలాగే ఆయ‌న కేడ‌ర్ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఆయ‌న కొన‌సాగుతారు అని అంటున్నారు..
 
అయితే భీమిలి నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ క‌న్ను ప‌డింది.. అక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నికల్లో పోటికి ఆయ‌న రెడీగా ఉన్నారు. ఒక‌వేళ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఒకే, లేక‌పోతే వైసీపీ జ‌న‌సేన ఆప్ష‌న్ ఆయ‌న పెట్టుకున్నారు.. దీంతో గంటా శ్రీనివాస‌రావు భీమిలీ నుంచి పోటీ పై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి..
 
ఇప్ప‌టికే ఆయ‌న విశాఖ‌లో మ‌రో ప్రాంతం నుంచి పోటికి రెడీ అవుతున్నారు అని వార్తలు వినిపించినా, ఆయ‌న భీమిలి నుంచే ఎక్కువ శాతం పోటికే సుముఖత చూపుతున్నారు.జిల్లాలో ఐదారు సెగ్మెంట్ల‌పై గంటా ప్ర‌భావం ఉంటుంది.. ఇది జ‌గ‌న్ కూడా గుర్తించారు.పైగా గంటా ఏ పార్టీలో ఉన్నా అక్క‌డ విజ‌యం త‌థ్యం అనే ఫార్మూలా కూడా ఉంది. అయితే గంటా మాత్రం వైసీపీకి వ‌చ్చేది లేదు అని చెబుతున్నా, ఆయ‌న పార్టీ మారే ముందు కీల‌క నిర్ణ‌యం తీసుకుని అది కేడ‌ర్ కు చెప్ప‌వ‌చ్చు అనే వార్త‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
 
ఇటు రాజ‌కీయంగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ప‌ర్స‌న‌ల్ గా ప‌వ‌న్ పై కూడా ఎటువంటి కామెంట్లు చేయ‌రు గంటా శ్రీనివాస‌రావు.. అయితే ఆయ‌న పై భీమిలిలో కూడా జ‌న‌సేనాని ఎటువంటి పంచ్ లు వేయ‌లేదు.. సో ఆయ‌న జ‌న‌సేన వైపు అడుగులు వేస్తున్నారా అని కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి..
 
ఓ సామాజికి వ‌ర్గం కూడా ఇటు గంటా చేరిక‌తో ఆ పార్టీకి మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతుంది.ఇవ‌న్నీ గంటా, జ‌న‌సేన‌లో చేరితో ప‌వ‌న్ కు ప్ల‌స్ అయ్యేవి.. అందుకే ఇటు ఉత్త‌రాంధ్రాలో ప‌వ‌న్ గంటా పై ఎటువంటి కామెంట్లు చేయ‌లేదు అని తెలుస్తోంది.. సో చూడాలి గంటా ఎటువైపు త‌న రూటు మార్చుకుంటారో,  ఈ 11 నెల‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో దీనిపై స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.