గంటా వ‌ర్సెస్ అవంతి బిగ్ ఫైట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 18:23:36

గంటా వ‌ర్సెస్ అవంతి బిగ్ ఫైట్

విశాఖ తెలుగుదేశం పార్టీలోని ఇద్ద‌రు నాయ‌కుల ఎపిసోడ్ ఒక రేంజ్ లో సాగుతోంద‌ట‌. ఇంత‌కు ఆ ఎపిసోడ్ ఏంటనుకుంటున్నారా, ద‌శాబ్ద కాలంగా ఇద్ద‌కు మిత్రులు ట్యాగ్ లైన్ కిందే ఆ నేత‌ల‌కు రాజ‌కీయం చేశారు. ఇక ఇప్పుడు ఒక‌రంటే ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. నాటి నేటివ‌ర‌కు ఇద్ద‌రు మిత్ర‌లు అని పిలుచుకున్న తెలుగు తమ్ముళ్లు, ప్ర‌స్తుతం ఇద్ద‌రు శ‌త్రువులు అని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం విశాఖ రైల్వే జోన్ కోసం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సీరియ‌స్ గా పోటీ చేస్తోంది. ఇక ఈ పోరాట క్రెడిట్ ను త‌మ ఖాత‌లో వేసుకోవ‌డానిక ఆ ఇద్ద‌రు నేత‌లు కింద‌మీద ప‌డుతున్నారు టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, ఎంపీ అవంతి శ్రీనివాస్.
 
విశాఖ రైల్వే జోన్ విభ‌జ‌న హామీల్లో ఒక‌టి.... అన్ని విభ‌జ‌న హామీల్లానే దీన్ని కూడా తుంగ‌లోకి తొక్కింది మోడీ స‌ర్కార్. అయితే టీడీపీ విశాఖ రైల్వే జోన్ కోసం పోరుబాట ప‌ట్టింది. ఇక ఈ పోరాటం కోసం క‌ష్ట‌ప‌డుతోంది నేనంటే నేను అని నిరూపించుకోవ‌డానికి ఇటు గంటా అటు అవంతి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నెల 4వ‌ తేదిన విశాఖ రైల్వేజోన్ సాధ‌న కోసం నిరాహార దీక్ష చేశారు. స‌హ‌జంగానే టీడీపీ ఎంపీ అయిన అవంతి శ్రీనివాస్ ఆ క్రెడిట్ ను త‌న ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక వెంట‌నే గంటా శ్రీనివాస్ విశాఖ రైల్వే జోన్ కోసం క‌ష్ట ప‌డుతోంది నేను అని నిరూపించుకునే ప‌నిలో ప‌డిపోయార‌ని తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతున్నారు. 
 
కొద్దిరోజుల క్రితం విశాఖ‌లో నాన్ పొలిటిక‌ల్ జేఏసీ ఆధ్వ‌ర్యంలో రైల్వే జోన్ నిర‌స‌న రాత్రి అనే పేరుతో ఆ రోజు రాత్రి అంతా నిర‌స‌న‌లు చేశారు. ఇక దీన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాస్ రావు తెల్ల‌వారు జామునే టీ తాగించి నిర‌స‌న‌ల‌ను విర‌మింప‌చేశారు. 
 
ఎంపీలు దీక్ష చేసిన‌ప్పుడు ప‌ట్టుమ‌ని ప‌దినిమిషాలు కూడా ఆ దీక్ష‌లో గంట ఉండ‌లేదు. ఇక పోటా పోటీగా ఇద్ద‌రు నేత‌లు కూడా త‌మ ఆదిప‌త్య పోరుకు రైల్వేజోన్ పోరాటాన్ని వేదిక‌గా చేసుకుంటున్నార‌ని, అలాగే రైల్వేజోన్ పోరాట క్రెడిట్ ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు వీరిద్ద‌రు విస్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పార్టీలో పెద్ద చ‌ర్చ సాగుతోంది.
 
గతంలో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వీరిద్ద‌రు క‌లిసే వ‌చ్చారు. పార్టీలు మార్చ‌డం దాక అన్ని క‌లిసిచేసిన ఇద్ద‌రు శ్రీనివాసులు ఇప్పుడు రైల్వేజోన్ పోరాటం కేంద్రంగా క‌త్తులు దూస్తున్నారు. అయితే దీనికి ప్ర‌ధానమైన కార‌ణం భీమిలీ నియోజ‌కవ‌ర్గం అని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి కావాల‌ని బ‌లంగా కోరుకుంటున్న అవంతి శ్రీనివాస్ భీమిలీ నుంచి పోటీ చెయ్యాల‌ని భావిస్తున్నార‌ట‌.
 
కానీ భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎట్టి ప‌రిస్థితిల్లో వ‌దిలేదిలేద‌ని ఇప్పుటికే తెగేసి చెప్పారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ వైపు అడుగులు వేసే ప్ర‌య‌త్నం కూడా చేసి చివ‌రి నిమిషంలో గంటా ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. వీరిద్ద‌రు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు. 
 
గంటాతో పాటు ఉంటే గంటా స‌హ‌చ‌రుడుగా క‌న్నా గంటా అనుచ‌రుడిగా అంద‌రూ చూస్తున్నార‌న్న భావ‌న అవంతిలో బ‌లంగా ఉంద‌ట దీంతో గంటాకు దూరం జ‌రిగార‌ట‌. ఇక ఆ త‌ర్వాత భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా ఇద్ద‌రి మ‌ధ్యా ఆదిప‌త్య‌పోరు మొద‌లైంది. ఇప్పుడు రైల్వేజోన్ పోరాట క్రెడిట్ కోసం మ‌రింత‌ తీవ్రంగా వార్‌ సాగుతోంది. విశాఖ టీడీపీలో ఇద్ద‌రు శ్రీనివాసులు స‌మ‌రం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుంద‌న్న‌ది జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.