ప‌వ‌న్ పై ఘ‌ట్ట‌మ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-24 09:25:57

ప‌వ‌న్ పై ఘ‌ట్ట‌మ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యా ణ్  పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్  నేత ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరి రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త రెండు రోజులుగా రాజ‌కీయ యాత్ర పేరుతో ప‌వ‌న్ కళ్యాణ్  తెలంగాణ‌లో  హాడావుడి చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 
 
ఈ క్ర‌మంలో తాజాగా   ఓ వెబ్ ఛానల్ కు ఇంట‌ర్వూ ఇచ్చిన ఘ‌ట్ట‌మ‌నేని తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌పై  మాట్లాడ‌టం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ పై ప‌లు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  ప‌వ‌న్ ఓ కామెడీ ఎపిసోడ్ అని, తోలు బొమ్మ‌లాట‌లో కేతిగాడు వ‌చ్చిన‌ట్లు వ‌స్తూ... పోతూ..... ఉంటాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
 
ప‌వ‌న్ బ‌య‌ట‌కు రావాలంటే చంద్ర‌బాబు బ‌ట‌న్ నొక్కాలి... టీడీపీకి అవ‌సరం వ‌చ్చిన‌పుడు ప‌వన్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాడ‌ని అన్నారు.  ఇంత‌వ‌ర‌కు  ఒక్క  స‌మ‌స్య పై కూడా ప‌వ‌న్ స‌రైన స‌మ‌యంలో స్పందించ‌లేద‌ని ఆయ‌న ఎద్దేవా  చేశారు. 
 
ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌భావంపై ఆయ‌న మాట్లాడుతూ.... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ 125 స్ధానాలు సాధించ‌డం ఖాయ‌మ‌ని, గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణ,  గుంటూరుతో పాటు గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ‌గా న‌ష్టం జ‌రిగింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అలాంటి ప‌రిస్ధితి రానివ్వ‌మ‌ని ఘ‌ట్ట‌మ‌నేని తెలిపారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.