ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త 46,290 ఉద్యోగాలు భ‌ర్తీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

andhra pradesh
Updated:  2018-09-08 10:49:27

ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త 46,290 ఉద్యోగాలు భ‌ర్తీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల‌కు తెలుగుదేశం పార్టీ స‌ర్కార్ తియ్య‌ని క‌బురు చెప్పింది. వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను గుర్తించి సుమారు 46,290 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నేడు ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స్ప‌ష్టం చేశారు.
 
ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల‌న్నింటిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో ఫిల్ చేయ‌నున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు ఈ ప్ర‌క్రియ‌లు ఇప్ప‌టికే ప్రారంభించామ‌ని తెలిపారు. ఈ 46,290 ఉద్యోగాల్లో ఉపాధ్యాయ, లెక్చ‌ర‌ర్  ఖాళీ కూడా ఉన్నాయ‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెలిపారు. 
 
అంతేకాకుండా ఇప్ప‌టికే వివిధ శాఖ‌ల్లో 2350 ఉద్యోగాల‌ను భ‌ర్తి చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ఇక మిగిలిన పోస్టుల‌ను త్వ‌ర‌లో భ‌ర్తి చేస్తామ‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments