వైసీపీ సోషల్ మీడియా వాలాంటీర్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 15:55:43

వైసీపీ సోషల్ మీడియా వాలాంటీర్స్

ఏపీలో మీడియా టీడీపీకి అనుకూలంగా ఉంటే, సోషల్ మీడియా మొత్తం వైసీపీకి సపోర్ట్ గా ఉంది...టీడీపీ ఏదైనా తప్పు చేస్తే నిముషాల్లోనే దేశం మొత్తం వైరల్ అయ్యేటట్టు చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా...టీడీపీ అనుకూల మీడియా చూపించని ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేసింది వైసీపీ సోషల్ మీడియా...
 
ఇప్పుడు ఏపీలో చాల మంది ప్రజలు నిజాల కోసం మీడియాలో కాకుండా, సోషల్ మీడియానే ఎక్కువగా వాడుకుంటున్నారు.ఇలా సోషల్ మీడియాలో టీడీపీ వైఫల్యాలను ఎండగడుతున్న వైసీపీ వాలంటీర్లపై టీడీపీ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతుంది...ఈ విషయంపై దృష్టి పెట్టిన వైసీపీ, సోషల్ మీడియా వాలాంటీర్స్ కు అండగా నిలవాలని భావించింది..
 
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పోరాటపటిమను చూపిస్తున్న వైసీపీ సోదర సోదరీమణులకు ఈ నిరంకుశ ప్రభుత్వం నుండి ఎదురౌతున్న న్యాయపరమైన చిక్కులను ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ మీకోసం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో, ఓ అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదిని మీకు అందుబాటులో ఉంచబోతుంది. వారికి సంభందించి పూర్తి వివరాలు రెండు, మూడు రోజుల్లో మీ ముందుకి తెస్తాం అంటూ ఒక ప్రకటన విడదల చేసింది.
 
ఈ ప్రకటనతో వైసీపీ సోషల్ మీడియా వాలాంటీర్స్ ఆనందంగా ఉన్నారు... ఈరోజు నుండి రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని ధీటుగా ఎదుర్కొంటూ, ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి మా వంతు కృషి చేస్తామని వైసీపీ సోషల్ మీడియా వాలాంటీర్స్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.