వైఎస్ అభిమానుల‌కు తీపిక‌బురు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 13:37:58

వైఎస్ అభిమానుల‌కు తీపిక‌బురు

ఆనందో బ్రహ్మ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి మంచి సక్సెస్ ను అందుకున్న‌ మహి వి.రాఘవ్, ఇప్పుడు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త‌నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత క‌థ‌ ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్ ను కూడా ఖరారు చేసి ఫస్ట్‌ పోస్టర్ ను కూడా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.
 
ఇక ఈ సినిమా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోపు విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోయే వ్య‌క్తుల‌ను ద‌ర్శ‌కుడు రాఘవ్ డిసైడ్ చేశారు. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు మమ్ముట్టిని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక  విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత పొన్న‌గంటి న‌టిస్తున్నార‌ని, అలాగే వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో హీరో సూర్య న‌టిస్తున్నార‌ని, వైఎస్ ష‌ర్మిల పాత్ర‌లో హీరోయిన్ భూమిక న‌టిస్తున్నార‌ట‌. ఇక వైఎస్ అనుచ‌రుడు సూరీడు పాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళీ న‌టీస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ మాత్రం వీటిపై స్పందించ‌లేదు దీంతో దాదాపు వీరినే ఎంపిక చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జోరుగా సాగుతోంది.
 
ఇక ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అని వైఎస్ అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక వారి కోరిక త్వ‌ర‌లో నెర‌వేరబోతోంది. ఎందుకంటే ఈ నెల 20వ తేదీనుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగు పార్టును ముగించనున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.