జేసీ నీ నాలుక కోస్తాం అంటూ.. వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp jc divakar reddy
Updated:  2018-09-21 11:52:11

జేసీ నీ నాలుక కోస్తాం అంటూ.. వార్నింగ్

అనంత‌పురం జిల్లా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే ఆ నాలుక‌ను కోసేస్తామ‌ని పోలీస్ అధికారులు గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం ప్ర‌భోదానంద స్వామి వ‌ర్గీయుల మ‌ధ్య, జేసీ అనుచ‌రుల  మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న‌లో జేసీ, పోలీసు శాఖను ఉద్దేసించి ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ప్ర‌భోదానంద స్వామి ఆశ్ర‌మంలోకి వెళ్ల‌కుండా హిజ్రాల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు జేసీ. అయితే తాజాగా ఆయ‌న చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై పోలీస్ అధికార సంఘం కార్య‌ద‌ర్శి గోరంట్ల మాధ‌వ్ స్పందించారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాల‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే నాలుక కోస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మేము మ‌గాళ్లం కాబ‌ట్టే పోలీసుల‌మ‌య్యామ‌ని మీడియా ముందు మీసం తిప్పారు.
 
జేసీ ఇలానే త‌ల‌తిక్క‌గా మాట్లాడితే ఆయ‌నపై చ‌ట్ట‌ప‌రంగా త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని మాధ‌వ్ హెచ్చ‌రించారు. పోలీసుల స‌హ‌నాన్ని ప‌రిక్షించ‌వ‌ద్ద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అధికార బ‌లంతో, అహంతో ప్ర‌వ‌ర్తిస్తే క‌బ‌డ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. జేసీ చేసిన వ్యాఖ్య‌లు అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకోవాల‌ని, అలాగే త‌మ‌కు క్ష‌మాప‌ణ‌ చెప్పాల‌ని గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.