బ్రేకింగ్.. గౌతం రెడ్డి ప్రెస్ మీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 12:31:00

బ్రేకింగ్.. గౌతం రెడ్డి ప్రెస్ మీట్

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌వాడ నేత గౌతం రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం ప్రెస్ మీట్ పెట్టారు. కొన్ని రోజుల క్రితం వంగ‌వీటి రంగ‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినందుకుగానూ ఆయ‌న్ను పార్టీ నుండి స‌స్పెండ్ చేశారంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.
 
అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో గౌతం రెడ్డి ప్ర‌త్య‌క్షం అవ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.....తాను వంగ‌వీటి గురించి ఉద్దేశ్య‌పూర్వ‌కంగా  ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, ఇంట‌ర్వూ మొత్తం ఫుటేజ్ నా ద‌గ్గ‌ర ఉంద‌ని, త‌న‌ని వైసీపీ నుండి స‌స్పెండ్ చేసిన‌ట్లు మీడియాలో చూశాన‌ని, కాని ఎలాంటి ఉత్త‌ర్వులు పార్టీ నుండి   రాలేదంటూ గౌతం రెడ్డి చెప్ప‌డం గ‌మనార్హం.
 
తాను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంగ‌వీటి రాధాకు ఫుల్ స‌పోర్ట్ ఇస్తామ‌ని గౌతం రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న జ‌రిగితే త‌న‌కు సీటు ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పినట్లు గుర్తు చేశారు గౌతం రెడ్డి. ఇక పై పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌బోతున్నాన‌ని గౌతం రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.