గౌత‌మ్ గంభీర్ వ‌చ్చేఎన్నిక‌ల్లో అక్క‌డనుంచే పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

goutham gambhir
Updated:  2018-08-20 05:42:48

గౌత‌మ్ గంభీర్ వ‌చ్చేఎన్నిక‌ల్లో అక్క‌డనుంచే పోటీ

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వస్తున్న త‌రుణంలో  ఓ వైపు  అధికార‌ నాయ‌కులు ప్ర‌చారానికి రంగం సిద్దం చేసుకుని మ‌రోసారి అధికార ప‌గ్గాల‌ను చేప‌ట్టాల‌ని చూస్తున్నారు. ఇక‌ మ‌రో వైపు ప్ర‌తిపక్ష‌ నాయ‌కులు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తున్నారు.అయితే ఇదే క్ర‌మంలో  కొత్త నేత‌లు కూడా ఆయా పార్టీల్లో చేరి 2019లో ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. వివిధ రంగాల్లో రానించిన వ్య‌క్తులు ఇప్పుడు రాజ‌కీయ‌రంగంలోకూడా త‌మ స‌త్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
అయితే ఈ వ‌రుస‌లో టీమిడియా మాజీ కెప్టెన్ గౌత‌మ్ గంభీర్ ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లో వ‌స్తున్నారు. కొన్నాళ్లుగా ఆట‌కు దూరంగా ఉన్న‌గౌత‌మ్ ఇప్పుడు ఫ్రెష్ గా రాజ‌కీయ అరంగేట్రం చేసి అందులో కూడా దుమ్ముదుల‌పాల‌ని చూస్తున్నారు. అయితే ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి వ‌స్తాని ప్ర‌క‌టిస్తే  భార‌తీయ జ‌న‌తా పార్టీ వెల్ క‌మ్ చెప్పేందుకు సిద్దంగా ఉంది. అంతేకాదు ఆయ‌న‌ను 2019లో దేశ వ్యాప్తంగా హోరా హోరీగా జ‌రుగ‌బోయే సార్వ‌త్రిక ఎన్నికల్లో పోటీ చేయించాల‌ని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంద‌ట‌. 
 
దేశ‌భ‌క్తి జాతీయ భావాలు ఎక్కువ‌గా ఉన్న గౌత‌మ్ కు ఖ‌చ్చితంగా బీజేపీ త‌ర‌పున టికేట్ ఇవ్వాల‌ని చూస్తుందోంది. అంతేకాదు దేశంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగినా కూడా గంభీర్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని స్పందించేవారు. ఇక ఆయ‌న స్పందించే విధానాన్ని ఘ‌మ‌నించి బీజేపీ... గౌత‌మ్ పార్టీకి ఎంతో ఉపయోగ ప‌డుతార‌ని గ్ర‌హించి ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.
 
 ఒక వేల గంభీర్ బీజేపీలో చేరితే వ‌చ్చే ఎన్నిల్లో పార్టీ త‌ర‌పున దేశ రాజ‌ధాని అయిన‌టు వంటి డిల్లీలో పార్టీ త‌ర‌పున టికెట్ ఇచ్చేందుకు సిద్ద‌మైంది అధిష్టానం. కానీ గౌత‌మ్ అధికారికంగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌లేదు. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితిలో దాదాపు గౌతీకి టీమీండియాలో చోటు ద‌క్కే అవ‌కాశాలు లేవు క‌నుక ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. 
 
36 సంవ‌త్స‌రాలు క‌లిగిన గౌతమ్ గంభీర్ త‌న సుదీర్ఘ క్రికెట్ ప్ర‌యాణంలో 58 టెస్టులు, అలాగే 147 వ‌న్డేల‌ను ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు 2011లో జ‌రిగిన వ‌రల్డ్ క‌ప్ చివ‌రి మ్యాచ్ లో 97 ప‌రుగులు చేసి శ‌భాష్ అనిపించుకున్న‌రు.  ఇప్పుడు గంభీర్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకూడా గ‌తంలో క్రికెట్ లో తెచ్చుకున్న పేరుని రాజ‌కీయాల్లో తెచ్చుకుంటారో లేదో వేచి చూడాలి.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.