ఎందుకో తెలుసా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 10:11:28

ఎందుకో తెలుసా...

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వంగ‌వీటి రంగా హ‌త్య‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ నేత గౌతం రెడ్డిపై పార్టీ అధిష్టానం వేటు వేసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే గౌతం రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్ కు బంధువు అవుతారు.

అయినా కూడా పార్టీలో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారెవ‌రైనా ఉపేక్షించేది లేద‌ని నిరూపించుకుంది వైసీపీ. ఈ క్ర‌మంలో స‌స్పెండ్ అయిన గౌతం రెడ్డి అనూహ్యంగా పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల‌వడం పై అనేక వార్త‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

కొంద‌రు స‌స్పెండ్ అయిన గౌతం రెడ్డి, జ‌గ‌న్ ను క‌లవ‌డంపై నెగిటీవ్ గా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే గౌతం రెడ్డి చేసిన త‌ప్పును స‌రి చేసుకునేందుకే వైయస్ జ‌గ‌న్ ను క‌ల‌వడం జ‌రిగింద‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో విజ‌య‌వాడ‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయ‌నే సంకేతాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి.

గౌతం రెడ్డి, జ‌గ‌న్ ను క‌ల‌వ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్న ప‌చ్చ బ్యాచ్ పై వైసీపీ మండిప‌డుతోంది. ఫోర్జ‌రీ కేసులో అడ్డంగా బుక్క‌యి కేసులో ఇరుక్కున్న అనంత‌పురం ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి స‌స్పెండ్ అయినా కూడా సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్న స‌భ‌లో వేదికపై కూర్చున్న విష‌యాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.