గౌరు చ‌రిత కామెంట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 14:37:13

గౌరు చ‌రిత కామెంట్ ?

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని  ప్ర‌క‌టించారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి.. వైసీపీలోకి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరిక అనేస‌రికి  జిల్లా వైసీపీ జోరు మ‌రింత పెరిగింది..
 
29వ తేదీ విజయవాడ సమీపంలోని పామర్రు వద్ద వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు కాటసాని స్పష్టం చేశారు.... 80 శాతం మంది వైసీపీలో చేరాలని తమ అభిప్రాయం చెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 29న పెద్ద ఎత్తున  కార్యకర్తలతో తరలి  వెళ్లి వైసీపీలో చేరుతున్నానని చెప్పారు..
 
ఇక ఆయ‌న కేడ‌ర్ మొత్తం బీజేపీకి వ‌రుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు..భారతీయ జనతాపార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, మెంబర్‌షిప్ కు రాజీనామా చేశారు....పాణ్యం నియోజకవర్గంలోని 4 మండలాల్లోని కార్యకర్తలంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారని కాటసాని స్పష్టం చేశారు.... ఇక జ‌గ‌న్ నుంచి ఎటువంటి స‌మాచారం లేక‌పోయినా టిక్కెట్ల‌పై ఇప్పుడే నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు..
 
పాణ్యం నియోజకవర్గ టిక్కెట్టు తమదేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత స్పష్టం చేశారు...వైసీపీని ఇక్క‌డ మ‌రింత బ‌లోపేతం చేశామ‌ని ఆమె తెలియ‌చేశారు.వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే గౌరు చ‌రిత‌..
 
కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె మాట్లాడారు... కాటసాని తమ పార్టీలో చేరడం వల్ల మరింత బలం చేకూరుతుందన్నారు.... వైసీపీలో మొదటి నుంచి సేవలందిస్తున్న తనకే టిక్కెట్టు ఇస్తానని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఎప్పుడో ఇచ్చారు అని ఆమె తెలియ‌చేశారు.. 
 
ఇక జ‌గ‌న్ ను కేడ‌ర్ ను న‌మ్ముకుంటూ తాను పార్టీలో జ‌గ‌న్ వెంటే ఉన్నాను అని తెలిపారు... వైసీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు  జిల్లాలో ఆరుగురు  టీడీపీలో చేరినా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తాను వైసీపీలో ఉండటంపై జగన్‌ తమపై పూర్తి నమ్మకం ఉంచారని ఆమె పేర్కొన్నారు...ఇక కర్నూలు ఎంపీ అభ్యర్థి ఎంపిక అధిష్టానం నిర్ణయమన్నారు.  ఇక ఇరువురితో చ‌ర్చించి పార్టీలో జ‌గ‌న్ కాట‌సానిని చేర్చుకుంటున్నారు అని జిల్లా వైసీపీ నాయ‌కులు అంటున్నారు... ఇక క‌ర్నూలు జిల్లాలో వైసీపీకి ఒక్కొక్క చోట మ‌రింత బ‌లం పెరుగుతూ వ‌స్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.