గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ అభ్య‌ర్థులు వీరే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp candidates
Updated:  2018-09-27 01:11:01

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ అభ్య‌ర్థులు వీరే

2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రజా సంక‌ల్ప‌యాత్ర చేస్తూ మ‌రో వైపు త‌న ఆలోచ‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. జ‌న‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయన్న ప్ర‌చారం సాగుతుండ‌టంతో జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ముందుగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. 
 
అయితే ముఖ్యంగా పార్టీ ప్రావిణ్య‌ త‌క్కువ‌గా ఉన్న జిల్లాల‌పై జ‌గ‌న్ క‌న్నేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ సీట్ల‌కు లైన్ క్లియ‌ర్ అయితే మిగిలిన సీట్ల విష‌యంలో క‌స‌ర‌త్తును పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే జ‌గ‌న్ రాజ‌ధాని ప్రాంతాలు అయిన గుంటూరు, కృష్ణా జిల్లాల‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.
 
ఈ జిల్లాలో జ‌గ‌న్ ఆచితూచి అడుగులు వేయాల్సి వ‌స్తుంది. ఎందుకంటే గ‌త ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకుండా ఎదురు దెబ్బ‌కొట్టింది ఈ రెండు జిల్లాలే. అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వైసీపీ గ్రాఫ్ గ‌త ఎన్నిక‌ల్లో పూర్తిగా విఫ‌లం అయింది. ఈ జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కేవ‌లం నాలుగు స్థానాల‌కు మాత్ర‌మే పరిమితం అయింది. 
 
ఇందులో పామ‌ర్రు ఎమ్మెల్యే అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక జ‌గ‌న్ కు బ‌లం మూడుసీట్ల‌కు ప‌రిమితం అయింది. అలాగే గుంటూరు జిల్లాలో కూడూ ఇదే ప‌రిస్థితి త‌లెత్తింది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో కూడా వైసీపీకి సేమ్ సీన్ రిపీట్ అయింది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఐదు సీట్లకు ప‌రిమితం అయింది వైసీపీ. ఇక వీరిలో కూడా కొందరు టీడీపీలోకి ఫిరాయించాల‌నుకున్న‌ప్ప‌టికి వైసీపీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డంలో స‌క్సెస్ అయింది. 
 
మొత్తం ఈ రెండు జిల్లాల్లో 33 అసెంబ్లీ స్థానాల‌కు గాను 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారంద‌రికి  వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు కొత్త‌గా పార్టీలో చేరిన కొంద‌రికి సీటు ఖాయం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో 12 మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన‌ 21 సీట్ల విష‌యంలో క‌స‌రత్తు చేస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
రాజ‌ధాని ప్రాంతాల్లో అభ్య‌ర్థులు ఇలా ఉంటార‌ని అంచ‌నా...
బాప‌ట్ల‌- కోన ర‌ఘుప‌తి 
విడ‌ద‌ల ర‌జ‌నీ- చిల‌క‌లూరిపేట‌
గుడివాడ‌-కొడాలినాని
మైల‌వ‌రం- వ‌సంత‌కృష్ణ‌ప్ర‌సాద్
స‌త్తెన‌ప‌ల్లి-అంబ‌టిరాంబాబు
గుర‌జాల‌- కాసు మ‌హేష్ రెడ్డి
న‌ర్సారావుపేట‌- గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి 
మ‌చిలీప‌ట్నం- పేర్ని నాని
పెడ‌న‌- జోగి ర‌మేష్
విజ‌య‌వాడ సెంట్ర‌ల్- మ‌ల్లాది విష్ణు
 నందిగామ – జ‌గ‌న్మోహ‌న్ రావు
 మంగ‌ళ‌గిరి- ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి
మాచ‌ర్ల‌- పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.