గురునాథ‌రెడ్డికి బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-04-20 16:58:07

గురునాథ‌రెడ్డికి బిగ్ షాక్

అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావ‌డం వెనుక జేసి దివాక‌ర్ రెడ్డి ప్రోద్బ‌లం ఉంది అన్న విష‌యం తెలిసిందే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర్ చౌద‌రికే సీటు అయితే పార్టీలో కేవ‌లం నాయ‌కుడిగానే గురునాథ్  రెడ్డి ని తీసుకున్నారు తెలుగుదేశం అధినేత... ఇక ప‌రిటాల సాయం జేసి అండ ఉండ‌టంతో గురునాథ్ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్లారు.
 
ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్  రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే షాక్ ఇచ్చారు....గురునాథ్‌ రెడ్డి అన్న నారాయణరెడ్డి కుమారులు తమ బాబాయి పై తిరుగుబాటు చేశారు. కృష్ణా జిల్లా వెళ్లి వైఎస్‌ జగన్‌ను కలిశారు.అయితే ఈ తిరుగుబాటుతో గురునాథ్  రెడ్డి షాక్ తిన్నారు.
 
ముందు నుంచి నారాయ‌ణ రెడ్డి కుటుంబం వైయ‌స్ కు స‌న్నిహితంగా ఉండేది.. ఇక ఆయ‌న త‌ర్వాత అన్న రాజ‌కీయాల‌ని త‌మ్ముడు గురునాథ‌రెడ్డి చూసుకున్నారు.. ఎమ్మెల్యేగా ఆయన నిల‌వ‌డం ఆయ‌న‌కు అన్న కుమారులు సాయం చేయ‌డం చేస్తూ వ‌చ్చారు.. అయితే గురునాథ్ రెడ్డి  సొంత నిర్ణ‌యాల‌తో త‌మ‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో వారు కూడా బాబాయికి క‌టీఫ్ చెప్పారు అని తెలుస్తోంది.
 
ఇక తెలుగుదేశంలో చేరిన స‌మ‌యంలో  గురునాథ్  రెడ్డికి మిస్స‌మ్మ భూముల‌ను అప్ప‌గిస్తామ‌నే డీల్ ను చేసుకున్నారు అని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి... ఇక నామినేటెడ్ పోస్టు కూడా ఇస్తాము అని చెప్పారు..బాబాయి మా నిర్ణ‌యం తీసుకోలేదు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌లేదు తాము వైసీపీలోనే ఉంటాము అని తెలియ‌చేశారు. పాద‌యాత్ర‌లో జగన్‌ను నారాయణరెడ్డి కుమారులు ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్‌ రెడ్డి కలిశారు....
 
ప్రాణమున్నంత వరకు తాము వైసీపీలోనే ఉంటామని స్పష్టం చేశారు. గురునాథ్‌రెడ్డితో పాటు తాము వైసీపీని వీడలేదని స్పష్టం చేశారు... తాము తెలుగుదేశం కార్య‌క్ర‌మాల్లో పాల్గోన‌లేద‌ని తెలియ‌చేశారు.. దీంతో బాబాయి గురునాథ‌రెడ్డి కంగుతిన్నారు అని ఇప్పుడు అక్క‌డ కేడ‌ర్ చ‌ర్చించుకుంటోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.