వైసీపీ వైపు చూస్తున్న గుర్నాథ్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-03 11:42:29

వైసీపీ వైపు చూస్తున్న గుర్నాథ్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు నాటి నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న జిల్లా అనంత‌పురం జిల్లా.  ఈ జిల్లా అంటే నంద‌మూరి ఫ్యామిలీకి ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు ఎంతో ప్రేమ. అంతేకాదు ముఖ్య‌మంత్రి ఎన్నో సార్లు స‌భా ముఖంగా త‌న‌కు అనంత‌పురం జిల్లా అంటే ఇష్టం అని భ‌హిరంగంగానే చెప్పారు. టీడీపీకి అంత‌టి ప్ర‌ధాన్యం ఉన్న ఈ జిల్లాలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సైకిల్ కు బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గుంత‌క‌ల్, రాయ‌దుర్గం, తాడిప‌త్రి, అనంత‌పురం అర్భ‌న్ సెగ్మెంట్ ల‌పై జేసీ క‌న్ను వెయ్య‌డంతో పార్టీలో గంద‌ర‌గోళంగా మారుతోంది.
 
అందులో ముఖ్యంగా అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి వ్య‌వ‌హారం చాలా క్రిటిక‌ల్ గా మారుతోంది. గతంలో వైసీపీలో ఉన్న ఆయ‌న ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కోరిక మేర‌కు ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక ఆయ‌న టీడీపీ తీర్థం తీసుకున్న‌ప్ప‌టినుంచి అధిష్టానం పెద్ద‌గా ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌కుంద‌ని బాధ‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 
 
అయితే ఒక‌నోక సంద‌ర్భంలో తీరిగి వైసీపీ లో చేరాల‌ని ప్ర‌య‌త్నం కూడా చేశారట‌. కానీ వైసీపీ త‌ల‌పులు ముసెయ్య‌డంతో గుర్నాథ్ రెడ్డి ప్ర‌య‌త్నం బెడ‌స‌కొట్టిందట‌. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు మంత్రి నారాలోకేశ్ ను క‌ల‌సి త‌న‌కు న్యాయం చెయ్యాల‌ని వేడుకున్న‌ట్లు స‌మాచారం.
 
ఇక ఆయ‌న స‌మ‌స్య‌ను ప‌రిగ‌న‌లోకి తీసుకున్న లోకేశ్ క‌చ్చితంగా న్యాయం చేస్తాన‌ని చెప్పారట‌. పార్టీ ప‌రంగా న్యాయం చేస్తారు త‌ప్ప టికెట్ పరంగా మాత్రం క‌ష్టంతో కూడుకున్న‌ది ఎందుకంటే ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఉన్నారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేస్తాన‌ని ధీమాగా ఉన్నారు. సో అప్ప‌ట్లో జేసీ దివాక‌ర్ రెడ్డి మాట విని టీడీపీలో చేరిన  గుర్నాథ్ రెడ్డి ప‌రిస్థితి గంద‌రగోళంగా మారుతుంద‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.