సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 14:18:37

సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రచారాలు మిన‌హా ఏపికి చేసింది ఏమీ లేదు అంటున్నారు వైసీపీ నాయ‌కులు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప‌రిపాల‌న‌లో ఎన్ని అవినీతి అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తున్నా వాటి పైనోరు మొద‌ప‌డం లేదు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.మ‌రీ ముఖ్యంగా నాలుగు సంవ‌త్స‌రాలు తెలుగుదేశం బీజీపీతో ఉండి రెండు నాల్క‌ల దోర‌ణితో తెలుగుదేశం మాట్లాడ‌టం ప్ర‌త్యేక హూదా సంజీవ‌నా అని అన్నా చంద్ర‌బాబు, నేడు ప్ర‌త్యేక హూదా కోసం ధ‌ర్మ‌పోరాటం చేయ‌డం పై యూట‌ర్న్ అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక బీజేపీ కూడా ఇదే పందాలో విమ‌ర్శ‌లు చేస్తోంది.. బీజేపీతో క‌లిసి ఉన్నంత సేపు బీజేపీ మంచిది. ఇప్పుడు బీజేపీ మంచిది కాదా, కావాల‌నే తెలుగుదేశం బీజేపీని ఏపీలో టార్గెట్ చేసింది అని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నాలుగేళ్ల‌ల్లో జ‌రిగిన అవినీతి పై క‌చ్చితంగా విచార‌ణ జ‌రుగుతుంది అని, అన్యాయాలు అక్ర‌మాలు అవినీతి చేసిన వారు తొంద‌ర‌లో జైలుకు వెళ‌తారు అని బీజేపీ ఫైర్ అవుతోంది.
 
తాజాగా  భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజ‌కీయాల్లో కొన్ని కీల‌క మార్పులు అనూహ్య‌ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి అని అన్నారు ఆయ‌న‌. వ‌చ్చే మూడు నుంచి ఆరు నెల‌ల్లో క‌చ్చితంగా ఏపీలో అనూహ్య ప‌రిణామాలు అంద‌రూ చూస్తారు అని తెలియ‌చేశారు.రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
 
కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేశారని ఆయ‌న ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్‌ నిర్ధారించిందని, కాగ్‌కు కేంద్రంతో గానీ, ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు. తెలుగుదేశం అసెంబ్లీని ఆ పార్టీ ప్ర‌చార వేదిక‌గా వాడుకుంటోంది అని విమ‌ర్శించారు ఆయ‌న‌. మొత్తానికి   జీవీఎల్ వ్యాఖ్య‌లు ఇప్పుడూ ఏపీ రాజ‌కీయాల్లో ఆలోచింప‌చేస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.