సంచ‌ల‌నం బాబు అవినీతి చిట్టా నా ద‌గ్గ‌ర ఉంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 13:53:34

సంచ‌ల‌నం బాబు అవినీతి చిట్టా నా ద‌గ్గ‌ర ఉంది

2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వారు చేస్తున్న పాపాలు, అవినీతి మొత్తం త‌న‌ ద‌గ్గ‌ర ఉంద‌ని బారతీయ జనతా పార్టీ నాయ‌కుడు జీవీఎల్ నరసింహారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, అధికార బ‌లంతో  టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అవినీతి చిట్టా మొత్తాన్ని తాము వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశంలో వివ‌రిస్తామ‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు.
 
టీడీపీ నాయకులు  స్థలాల్ని బట్టి స‌భ‌ల‌ను బ‌ట్టి మాట మార్చి డ్రామాలు ఆడుతున్నార‌ని జీవీఎల్ మండిప‌డ్డారు. అందుకే తాను అనేక సంద‌ర్భాల్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద  డ్రామాల పార్టీ అంటాన‌ని అన్నారు. 2014లో చంద్ర‌బాబు నాయుడును ఎన్నుకున్నందుకు నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌లు బాద‌ప‌డుతున్నార‌ని ఇక వారి బాధకు త్వ‌ర‌లో స్వ‌స్తి చెప్పేందుకు సిద్ద‌మ‌య్యార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌న్ని చంద్ర‌బాబు నాయుడు తన ఖాతాలో వేసుకుని ప్ర‌చారం చేస్తున్నార‌ని జీవిఎల్ మండిప‌డ్డారు. 
 
చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ పాపానికి 1500 రోజులుగి భ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే మ‌రికొద్ది రోజుల్లో టీడీపీ నాయ‌కులు బాగోగుల‌ను ప్ర‌జ‌లు చూపిస్తామ‌ని వారు ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎంత‌మేర‌కు అవినీతికి పాల్ప‌డ్డారో అక్ష‌రం త‌ప్పు పోకుండా క్షుణ్ణంగా వివ‌రిస్తామ‌ని ఆయ‌న స్ప‌స్టం చేశారు.
 
పార్ల‌మెంట్ స‌మ‌వేశాల్లో టీడీపీ నాయ‌కులు అవిశ్వాసం పెడితే చ‌ర్చ‌కు మేము రెడీ అని స్ప‌ష్టం చేశారు. స‌భ స‌జావుగా జ‌రిగేందుకు అంద‌రు స‌హ‌క‌రించాల‌ని ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను స‌మావేశాల్లో వివ‌రిస్తుంద‌ని జీవీఎల్ పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.