విజ‌య‌సాయిరెడ్డికి హ‌రిబాబు భ‌రోసా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

hari babu assured vijaisai reddy
Updated:  2018-03-18 12:22:56

విజ‌య‌సాయిరెడ్డికి హ‌రిబాబు భ‌రోసా ?

రాజ‌కీయంగా ఎవ‌రు ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలియ‌దు.. ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ మంచి మిత్రులుగా ఉండేవారు.. ఇక ఎన్డీయే నుంచి తెలుగుదేశం రావ‌డంతో రాజ‌కీయంగా తెలుగుదేశం మ‌ధ్య‌లో ఇరుక్కుపోయింది.. ఇక కేంద్రం నుంచి ఎటువంటి నిధులు లేకుండా ఒంటరి రాష్ట్రం అయిపోయేలా ఉంద‌ని అంటున్నారు కొంద‌రు.. కేంద్రంలో ఎటువంటి ప‌నులు జ‌రుగ‌వు అని డైల‌మాలో కొంద‌రు తెలుగుదేశం నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
 
   ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ నాయ‌కులు బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్నారు అని విమ‌ర్శ‌లు చేసిన  తెలుగుదేశం, ఇప్పుడు ప‌వ‌న్ ను దగ్గ‌ర‌కు బీజేపీ చేర్చుకుంది అంటోంది.. అయితే జ‌న‌సేనాని వీరికి కౌంట‌ర్లు బాగానే ఇస్తున్నాడు. అలాగే మోదీని వైసీపీ నాయ‌కులు ఎవ‌రైనా క‌లిస్తే తెలుగుదేశం ర‌క్తం మ‌రిగిపోతోంది.ఇక విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని మోదీ వెనుక ఎందుకు తిరుగుతున్నారు, రీజ‌న్ ఏమిటి, జ‌గ‌న్ కేసులు కొట్టించ‌డానికే తిరుగుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు.
 
ఇక తాజాగా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి క‌లిస్తే త‌ప్పు ఏమిటి అని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.. ఇదే విష‌యాన్ని ఏపీ బీజీపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు..దీనిపై హరిబాబు స్పందిస్తూ ఒక ఎంపీగా విజయసాయి రెడ్డి ప్రధానిని కలవడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. ఎంపీలకు ప్రధానిని కలుసుకునే హక్కు ఉంటుందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ప్రధాని గౌరవిస్తారని చెప్పారు... అయితే విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం నాయ‌కుల కంటే ఎక్కువ సార్లు పీఎంని క‌లిసి ఏం చ‌ర్చిస్తున్నారు అని, వైసీపీ పై తెలుగుదేశం ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ‌లు చేస్తోంది.. తాజాగా హ‌రిబాబు విజ‌య‌సాయిరెడ్డికి భ‌రోసా ఇవ్వ‌డంతో మ‌నకు హ‌రిబాబు కూడా మెండిచెయ్యి చూపించారు అనేలా భావిస్తోంది తెలుగుదేశం పార్టీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.