బాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి హరికృష్ణ‌ ప్ర‌చారానికి ఎన్టీఆర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-30 14:57:09

బాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి హరికృష్ణ‌ ప్ర‌చారానికి ఎన్టీఆర్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఊహించ‌ని రీతిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య‌ వీప‌రీతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019లో ఖ‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి సీనియ‌ర్ టీడీపీ నాయ‌కులు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌క‌లు అవ‌కాశం దొరికితే చాలు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు
 
అయితే ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో య‌ల‌మంచిలి ర‌వి రాజ‌కీయంగా టీడీపీలో ఓ వెలిగిన వెలిగి వ్య‌క్తి . ఇక ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కులు త‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని వైసీపీ తీర్థం తీసుకున్నారు. య‌ల‌మంచిలితో పాటు వసంత కృష్ణ ప్ర‌సాద్ ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్థం తీసుకుంది.  తాజాగా రాయ‌ల‌సీమ‌కు చెందిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అనుచ‌రుడు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడు నంద‌మూరి హ‌రిక‌ష్ణ కూడా వైసీపీ తీర్ధం తీసుకోనున్నార‌ట‌. ఈయ‌న చాలా రోజుల నుంచి తెలుగు దేశంపార్టీ కార్య‌క‌లాపాల్లో కూడా మొక్కుబ‌డిగా హాజ‌రు అవుతున్నారు త‌ప్ప పార్టీ అభివృద్ది కోసం ఏ మాత్రం ప‌ని చేయ‌డంలేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పోయినంత‌కాలం పార్టీలో ఇలా స‌ర్ధుకుంటూపోతే త‌న‌కు రాజ‌కీయ మ‌నుగ‌డ‌ ఉండ‌ద‌ని భావించి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే ఈ క్ర‌మంలో హ‌రికృష్ణ, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాసంలో ఆయ‌న‌ను క‌లుసుకునేందు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
వైఎస్ జ‌గన్ అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ నేప‌థ్యంలో ప్ర‌తీ శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజ‌రుకావాల్సింది. అందుకే నిన్న జ‌గ‌న్ సీబీఐ కోర్టుకు హాజ‌రు అయ్యారు. కోర్టు విచార‌ణ ముగిసిన త‌ర్వాత జ‌గ‌న్ నివాసంలో హరికృష్ణ క‌లుసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్టీ త‌ర‌పున హ‌రికృష్ణ కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ప్ర‌చారం చేయించారు. 
 
ఇక ఇప్పుడు హరికృష్ణ వైసీపీ తీర్థం తీసుకుంటే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఎన్టీఆర్ ను ప్ర‌చారం చేయించేందుకు పార్టీ అధిస్టానం కూడా సుముఖంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌ ఈ వార్త‌ల‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌టన‌ రాలేదు. ప్ర‌క‌ట‌న రావాలంటే వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయిన త‌ర్వాత ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవకాశం ఉంద‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.