బాబు డైల‌మా హరికృష్ణ కొత్త ఎత్తులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 01:12:00

బాబు డైల‌మా హరికృష్ణ కొత్త ఎత్తులు

రాజ్యస‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇప్ప‌టికే విడుద‌ల అయింది... ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మూడు స్థానాల్లో ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ హించ‌నున్నారు.. అయితే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు,టాలీవుడ్  చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ హీరో టీడీపీ త‌రుపున పోటీ  చేసేంతెకు సిద్ద‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది...
 
ఈ క్ర‌మంలో అధికార తెలుగు దేశం పార్టీ త‌రపున లోక్ స‌త్తా పార్టీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయణ పోటీ చేయ‌నున్నారు అనే వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.... కొద్ది రోజులు క్రితం కేంద్రం నిధులు కేటాయింపుకు సంబంధించి నిజాల‌ను తెలుసుకునేందుకు  జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీలో కార్య క్ర‌మంలో జేపీ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే...
 
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ త‌రపున జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌కు రాజ్య స‌భ సీటు కేటాయించ‌నున్నారు అని తెలియ‌డంతో.. చంద్ర‌బాబు బావ‌మ‌రిది మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు హ‌రికృష్ణ త‌ప్పుబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది...ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా త‌న‌కు సీటు కేటాయించ‌కుండా, పోయి జేపీకి కేటాయించ‌డంతో ఆయ‌న మ‌న‌స్దాపం కొత్త ఆలోచ‌న‌లో ఉన్నారు అని అంటున్నారు...
 
దీంతో పాటు చంద్ర‌బాబు కేవ‌లం త‌న కుమారుడు నారా లోకేశ్ మాత్ర‌మే తెర‌మీద‌కు తెస్తున్నార‌ని ఎన్టీఆర్ ను  మాత్రం పార్టీ త‌రపున గుర్తించ‌క‌ పోవ‌డంతో హ‌రికృష్ణ బాబును డైల‌మాలో దించిన‌ట్టు తెలుస్తోంది...అలాగే హిందూపురంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రపున బాల‌కృష్ణ‌ ఎమ్మెల్యే గా గెలిచినా కానీ, ఆ నియోజ‌క వ‌ర్గానికి ఎటువంటి నిధులు చంద్ర‌బాబు కేటాయించ‌లేదు... దీంతోపాటు అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఏ ఒక్క‌చోట జ‌రిపించ‌క పోవ‌డంతో హ‌రికృష్ణ  ముఖ్య‌మంత్రికి తెలియ‌కుండా కొత్త‌దారి ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.