బావ యాక్ష‌న్ హ‌రికృష్ణ రియాక్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-16 13:10:54

బావ యాక్ష‌న్ హ‌రికృష్ణ రియాక్ష‌న్

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత నందమూరి హరికృష్ణ స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాస నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడడంలో రాజీపడే ప్రసక్తే లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు.
 
ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగ‌తెంపులు చేసుకోవ‌డం పై తెలుగుదేశం నాయ‌కులు చాలా మంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.. ఇటు బీజేపీ మాత్రం తెలుగుదేశం వైఖ‌రిని ప్ర‌శ్నిస్తోంది.. ఎటువంటి పొలిటిక‌ల్ డ్రామాలు ఆడుతున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని బీజేపీ మండిప‌డుతోంది.. కావాలనే ప‌వ‌న్ ను వెనుక ఉండి బీజేపీ ఆడిస్తున్న పొలిటిక‌ల్ డ్రామా అని తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తోంది.. ఇటు వైసీపీ ముందుగా అవిశ్వాస తీర్మానానికి రెడీ అయింది... నేడు అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని చెప్ప‌డంతో తెలుగుదేశం రాత్రికి రాత్రి తన ఆలోచ‌న‌ను మార్చుకుంది.
 
వెంట‌నే తెలుగుదేశం వైసీపీకి స‌పోర్ట్ ఇవ్వ‌ద్ద‌ని, ఆ క్రెడిట్ జ‌గ‌న్ కు రాకూడ‌దు అనే ఉద్దేశ్యంతో, తెలుగుదేశం ఈ వ్యూహాం ప‌న్నింది అంటున్నారు నాయ‌కులు. మొత్తానికి ఇటు తెలుగుదేశం అటు వైసీపీ కేంద్రం పై అవిశ్వాసానికి ఇండివిడ్యువల్ గా వెళ్ల‌నున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.