జ‌గ‌న్ కు జై కొట్టిన మ‌రో హీరో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:00:54

జ‌గ‌న్ కు జై కొట్టిన మ‌రో హీరో

టీడీపీ అధికారంలోకి వ‌న్తే విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని, అలాగే నిరుద్యోగుల‌కు ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని, ఉద్యోగం రాని ప‌క్షంలో నిరుద్యోగ భృతి కేటాయిస్తామ‌ని, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫి, రైతుల‌కు రుణ‌మాఫి చేస్తాన‌ని చెప్పి చంద్ర‌బాబు అదికారంలోకి వ‌చ్చారని కానీ, అయ‌న అధికారంలోకి వ‌చ్చాక  ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.
 
అయితే ఈ సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాంధ్ర‌లోని నాలుగు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. 2017 న‌వంబ‌ర్ 6 న ప్రారంభించిన ఈ పాద‌య‌త్ర‌కు అగుడుగునా ఇసుక వేస్తే రాలనంత జ‌నం జ‌గ‌న్ తోపాటు అడుగులో అడుగు వేస్తూ ఆయ‌న‌కు అండ‌గా నిలుస్తున్నారు.
 
ఇక జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి ఇండ‌స్ట్రీకి చెందిన న‌టీన‌టులు జ‌గ‌న్ కు మద్ద‌తు తెలుపుతున్నారు. అయితే ఇప్ప‌టికే డైరెక్ట‌ర్, హాస్య‌న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ను క‌లిసి ఆయ‌న‌తో పాటు పాద‌యాత్ర చేశారు. ఇక‌ మ‌రోన‌టుడు పృథ్యీ కుడా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలిపారు.
 
అయితే ఇదే క్ర‌మంలో డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలిపారు. త‌ణుకులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, జగన్ ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకమ‌ని అన్నారు. పాద‌యాత్ర చేసిన ప్ర‌తీ ఒక్క‌రూ విజ‌యం పొందార‌ని, ఈ పాద‌యాత్ర ఇప్పుడిప్పుడే పుట్టింది కాద‌ని ఇది రాజుల కాలం నాటి నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని అన్నారు.
 
గ‌తంలో కూడా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేసి ముఖ్య‌మంత్రి అయ్యార‌ని గుర్తు చేశారు మంచు విష్ణు. ఎవ‌రైనా ఒక ఐదు కిలోమీటర్లు న‌డ‌వ‌గానే అల‌సిపోతార‌ని కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం 2200 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం మాములు విష‌యం కాద‌ని ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని మంచువిష్ణు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.