బాలయ్య‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

balakrishna and pawan kalyan
Updated:  2018-07-25 12:03:28

బాలయ్య‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2014లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కార‌ణం అయిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్... కొద్ది రోజుల క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను గుంటూరు సాక్షిగా బ‌హిర్గతం చేసి టీడీపీ మిత్ర ప‌క్షానికి గుడ్ భై చెప్పారు. ప‌వ‌న్ ఎప్పుడు అయితే టీడీపీ మిత్ర ప‌క్షానికి గుడ్ బై చెప్పారో అప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఆయన కో కోల‌కు మ‌చ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు ప‌వ‌న్.
 
2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు... అధికార బలంతో విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డ్డార‌ని అందుకు త‌గిన సాక్షాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జనసేన పోరాటయాత్ర పేరుతో ప్ర‌తీ జిల్లాలో ప‌ర్య‌టించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. 
 
ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ అభిమానులను పోలీస్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నార‌ని  బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని ఈ సందర్భంగా అభిమానులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ విష‌యంపై తీవ్రంగా స్పందించిన ప‌వ‌న్.. త‌మ పార్టీ అభిమానులు బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారు మ‌రీ తుపాకీతో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. మ‌రి ఈ విష‌యం పై హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.