వైఎస్ బ‌యోపిక్ లో హీరోయిన్ గా ఆమె ఫిక్సా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys rajasekhar reddy image
Updated:  2018-03-11 10:38:02

వైఎస్ బ‌యోపిక్ లో హీరోయిన్ గా ఆమె ఫిక్సా..?

చిత్ర ప‌రిశ్ర‌మ రంగంలో ఇటు టాలీవుడ్ లో కానీ అటు బాలీవుడ్ లో కానీ బ‌యోపిక్ ల‌ హ‌వా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే.. అయితే ఇప్ప‌టికే మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత నంద‌మూరి తార‌క రామారావు చ‌రిత్ర‌ ఆధారంగా చేసుకుని టాలీవుడ్ లో ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. 
 
ఈ రెండు సిమాల‌లో ఒక చిత్రానికి నంద‌మూరి వార‌సుడు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ త‌న తండ్రి పాత్ర‌లో న‌టించ‌నున్నారు...అయితే ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌కు పూర్తి చేసుకుని త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ముహూర్తానికి టెంకాయ కొట్టనుంది చిత్ర యూనిట్.. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.. కాగా మ‌రో సినిమాకు విల‌క్ష‌ణ‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు
 
అయితే ఈ నేప‌థ్యంలోనే దివంగ‌త నేత ఏపీ మాజీ  ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జీవిత‌ చ‌రిత్ర ఆధారంగా చేసుకుని వెండి తెర‌పై  చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు.. ఈ చిత్రానికి వి.ర‌ఘవ్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.. కాగా వైఎస్ కుటుంబానికి ద‌ర్శ‌కుడు  పూరి జ‌గ‌న్నాథ్ కు స‌న్నిహిత సంబంధం ఉండ‌డంతో మొద‌ట‌ ఈ సినిమాకు పూరినే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు అని అనుకున్నారు... కానీ అత‌ని చేతిలో వేరే ప్రాజెక్ట్ లు ఉండ‌డంతో వైఎస్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేక పోయార‌ట‌..అయితే పూరి స్థానాన్ని ద‌ర్శ‌కుడు రాఘ‌వ్ పూర్తి చేశారు.
 
రాఘ‌వ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ పాత్ర‌లో మ‌ళ‌యాల ప్ర‌ముఖ న‌టుడు మ‌మ్ముట్టి న‌టించ‌నున్నారు... ఈయన సరసన నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. అయితే ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.. మ‌రి ఈ వార్త‌ల పై చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.