ఆ హీరోలు జ‌గ‌న్ కోసం సిద్దం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 15:42:27

ఆ హీరోలు జ‌గ‌న్ కోసం సిద్దం

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కులు రోజుకొక రంగు పూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో ముఖ్యంగా అధికార తెలుగుదేశంపార్టీ నాయ‌కులు తాము అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన క్ర‌మంలో మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను రాష్ట్ర‌వ్యాప్తంగా ఏర్పాటు చేసి టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ త‌ర్వాత ఏ విధంగా అభివృద్ది చేశారో అన్న విష‌యాల‌ను స‌భాముఖంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు.
 
ఇక మ‌రోవైపు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైయ‌స్సార్  కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో అధికారమే లక్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరు రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తున్నారు.... ఈ పాద‌యాత్ర‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ఆవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌స్తున్నారు జ‌గ‌న్. ఇక దీంతో పాటు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా స్పీడును పెంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికార బ‌లంతో సుమారు మూడు ల‌క్ష‌ల కోట్ల‌ ప్ర‌జా ధ‌నాన్ని అక్ర‌మంగా విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
ఇక‌ ఈ మ‌ధ్య‌కాలంలో టీటీడీలో నగలు పోయాయంటూ అర్చ‌కులు ఈ సంగ‌తి బ‌య‌ట పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఆ న‌గ‌లు ఎవ‌రి ద‌గ్గ‌ర ఉండ‌వ‌ని అవి కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నివాసంలో ఉంటాయ‌ని 12 గంట‌లో ఆయన‌ ఇంటిపై సీబీఐ దాడులు చేస్తే ఖ‌చ్చితంగా ఆ న‌గలు దొరుకుతాయ‌ని, లేక‌పోతే అవి కూడా చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు త‌ర‌లిస్తార‌ని చెప్పారు. అంతే కాదు ఆయ‌న ఇంట్లో న‌గ‌లు దొర‌క‌క‌పోతే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు విజ‌య‌సాయి రెడ్డి.
 
ఇక ఇదే క్ర‌మంలో తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టులు కూడా టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ర‌చ‌యిత‌. డైరెక్ట‌ర్, హాస్య‌న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ, అలాగే పృథ్వీ రాజ్ కూడా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ క‌లుసుకుని ఆయ‌న‌తోపాటు సుమారు మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ పాద‌యాత్ర చేశారు. అ త‌ర్వాత వీరు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి టీడీపీపై విమ‌ర్శలు చేయ‌డం స్టార్ట్ చేశారు. అయితే ఇండ‌స్ట్రీ నుంచి వీరు జ‌స్ట్ ఎంట్రీనే ఇచ్చారు. ఇంకా మిగిలిన వారు కూడా త్వ‌ర‌లో  వైసీపీకి  స‌పోర్ట్ చేస్తార‌ని ఈ దెబ్బ‌కు టీడీపీ ప‌త‌నం అవ్వ‌డం ఖాయం అని భావిస్తున్నారు.
jagan
 
అయితే ఇప్ప‌టికే  సోష‌ల్ మీడియా అకౌంట్ వేదిక‌గా చేసుకుని కొంత‌మంది ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు జ‌గ‌న్ పై త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వారు చెప్పిన అభిప్రాయాన్ని వైఎస్సార్ కుటుంబం అనే ఇన్‌స్ట్రాగామ్  అకౌంట్ ద్వారా ఒక ఫోటోలో పొందుప‌రిచారు.
 
ముందుగా హీరో విశాల్ జ‌గ‌న్ గురించి త‌న అభిప్రాయం- ఐల‌వ్ జ‌గ‌న్ మూడువేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం అంటే మాట‌లు కాదు.అలాగే కృష్ణ కూడా ట్రెండ్ ను చూస్తుంటే కాబోయే సీఎం జ‌గ‌నే అవుతార‌ని చెప్పారు. ఇక పృథ్వీ కూడా ద‌మ్మున్న నాయ‌కుడు జ‌గ‌నే కాబోయే సీఎం అన్నారు. ఇక పోసాని మాటలు, రాష్ట్ర‌నికి జ‌గ‌న్ లాంటి స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు కావాలి జ‌గ‌న్ కే  నాఓటు అని చెప్పారు.
 
ఇక నిఖిల్ కూడా నేను గుంటూరులో రెండురోజులు షూటింగ్ చేయ‌లేక పోయాను జ‌గ‌న్ గారు ఇంత ఎండ‌లో అన్ని వేల కిలో మీట‌ర్లు న‌డ‌వ‌డం అంటే మాట‌లు కాదు అని త‌న అభిప్రాయాన్ని తెలిపారు. నిఖిల్ తోపాటు సీకే నాయుడు కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూస్తుంటే ఒక మ‌గాడిని చూసిన‌ట్లు అనిపిస్తుంద‌ని అన్నారు. అలాగే మంచు విష్ణు కూడా జ‌గ‌న్ గురించి త‌న అభిప్రాయాన్ని చెప్పారు. 
 
పాద‌యాత్ర ఈ మ‌ధ్య‌కాంలో వ‌చ్చింది కాద‌ని అది రాజుల కాలం నాటి నుంచి వ‌స్తుంద‌ని అన్నారు. పాద‌యాత్ర చేసిన వారు ఎవ‌రు ఫేల్ కాలేద‌ని గ‌తంలో కూడా వైఎస్సార్ పాద‌యాత్ర చేసి ముఖ్య‌మంత్రి అయ్యార‌ని తెలిపారు,  అలాగే బీజేపీ నాయ‌కుడు కృష్ణం రాజు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై స్పందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం అవుతార‌ని తెలిపారు. ఇక ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను చూస్తుంటే వ‌చ్చే రోజుల్లో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక వీరంద‌రు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని స‌పోర్ట్  చేస్తుండ‌టం చూస్తుంటే 2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ పిలుపు నిస్తే ఖ‌చ్చితంగా ప్ర‌చారం చేసేందుకు సిద్దంగా ఉన్నార‌న‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.