చంద్ర‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-08-31 11:26:03

చంద్ర‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌స‌వ‌తార‌కం కిట్స్ వ్య‌వ‌హారంలో హైకోర్టు సీరియ‌స్ అయింది. వైద్య‌,విద్వా క‌మీష‌న‌ర్ పూనం మాల‌కొండ‌య్య‌పై కోర్టు దిక్క‌ర‌ణ నోటీసుల‌ను జారీ చేసింది. బ‌స‌వ‌తార‌కం కిట్స్ పంపిని నిలిపివేయ‌మ‌ని చెప్పినా కూడా  ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
 
ఓ వైపు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించి మ‌రోవైపు 30వ తేది వ‌ర‌కు కిట్ల‌ పంపిని అనుమ‌తి ఇవ్వ‌డంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అర్హ‌త లేని కంపెనీలతో మ‌ళ్లీ ఎలా స‌ర‌ఫ‌రాకు అనుమ‌తి ఇస్తారంటూ టీడీపీ స‌ర్కార్ న్యాయ‌స్థానం మండిప‌డింది. అంతేకాదు ఈ కిట్ల స‌ర‌ఫ‌రాకు సంబంధించి నాలుగువారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ హైకోర్టు ఆదేసించింది. కోర్టు దిక్క‌ర‌ణ చ‌ర్య‌లు ఎందుకు తీసుకోకుడ‌దో చెప్పాల‌ని నోటీసులో పేర్కొంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.