ఫిరాయింపు ఎమ్మెల్యేల కోర్టులో షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla image
Updated:  2018-03-13 05:18:59

ఫిరాయింపు ఎమ్మెల్యేల కోర్టులో షాక్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేసే విధంగా, తెలుగుదేశం అడుగులు వేస్తోంది అని, వైయ‌స్సార్ సీపీపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హారిస్తోంది అనే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.. అధికార పార్టీలో ఉండి మెజార్టీ స‌భ్యులు ఉన్నా స‌రే ఏపీలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు చంద్ర‌బాబు.
 
ఇక తెలంగాణ‌లో తెలుగుదేశం నుంచి టీఆర్ ఎస్ పార్టీలోకి ఫిరాయింపులు జ‌రిగిన స‌మ‌యంలో వారిని నింధించి రాజ్యాంగాన్ని దిక్క‌రించారు అని గొంతు చించుకున్న పార్టీ ఏపీలో త‌మ విధానాన్ని బ‌య‌ట‌పెట్టింది.. కాని ఇక్క‌డ ఫిరాయింపుల‌కు తెలుగుదేశం అంకురార్ప‌ణ చేసింది అనే చెప్పాలి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపుల వేడి మ‌రింత రాజుకుంది. అయితే సెంట్ర‌ల్ నుంచి తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డంతో  కాస్త సందిగ్దంలో ఉంది, అందుకే ఫిరాయింపుల‌కు బాబు ముందుకు వెళ్ల‌డం లేదు.
 
ఇక వైసీపీ ఈ ఫిరాయింపుల‌పై అనేక సార్లు తెలుగుదేశానికి స‌వాళ్లు విసిరింది.. వైసీపీలో గెలిచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో రావాలి అని పిలుపునిచ్చింది. కాని తెలుగుదేశం ఆ దైర్యం చేయ‌లేదు, దీనిపై గ‌వ‌ర్న‌ర్ నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కూ అంద‌రికి ఫిర్యాదు చేసింది వైసీపీ.
 
తాజాగా ఏపీలో ఫిరాయింపుల వ్య‌వ‌హారం పై హైకోర్టులో మ‌రో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది... వైసీపీ గుర్తుపై గెలిచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన 22 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్ దీనిపై చర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే పార్టీ ఫిరాయించిన నాయ‌కుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాలి అని కోర్టును కోరారు..
 
ఇక దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్దానం పార్టీ ఫిరాయించిన 22 మందికి నోటీసులు జారీ చేసింది.... ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.