ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు హైకోర్ట్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 17:47:38

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు హైకోర్ట్ షాక్

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక మెజారిటీతో గెలిచి అధికార బ‌లంతో సైకిల్ నాయ‌కులు  ప్ర‌క‌టించిన ఆఫ‌ర్స్ కు అమ్ముడు పోయి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలోకి 23 మంది వైసీపీ నేత‌లు ఫిరాయించిన సంగ‌తి తెలిసిందే...  అధికార బ‌లంలో ఫిరాయించిన వారిపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ  గ‌తంలో వైసీపీ నేత‌లు స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు, కానీ వారిపై స్పీక‌ర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.
 
దీంతో మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ‌వాది సుధాకర్‌రెడ్డి  త‌రుపున హైకోర్ట్ లో గ‌తంలో  పిటిషన్ వేయించారు.. వీరు వేసిన పిటీష‌న్ ఈ రోజు న్యాయ‌స్ధానం చ‌ర్చ జ‌రిపింది...ఈ చ‌ర్చ‌లో వాద‌న‌లు విన్న అదిష్టానం మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పీకర్‌కు నోటీసులు జారీచేసింది. అలాగే  తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది న్యాయ‌స్దానం. 
 
 తాము ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా కానీ స్పీకర్ కోడెల చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి వాదనలతో విన్న ధర్మాసనం​.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్‌ నిర్దిష్ట సమయంలో స్పందించాల్సి ఉందన్న వాదనతో ఏకీభవించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.