హోం మంత్రి చిన‌రాజ‌ప్ప రాజీనామా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 16:18:40

హోం మంత్రి చిన‌రాజ‌ప్ప రాజీనామా..?

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి షాక్ ల మీద షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుత‌న్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నటీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులంద‌రు పాద‌యాత్ర చేస్తున్నప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు కూడా అవ‌కాశం దొరికితే చాలు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నార‌ని ఏపీ స‌చివాలయం చుట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ఏ జిల్లాలో అయితే పాద‌యాత్ర చేస్తారో ఆ జిల్లాలో టీడీపీ నాయ‌కుల్లో మార్పు క‌చ్చితంగా వ‌స్తోంద‌ని ఈ మార్పుతో చంద్ర‌బాబుకు కోలుకోలేని దెబ్బ త‌గులుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.
 
అయితే మ‌రికొన్నిరోజుల్లో విశ్లేష‌కులు చెప్పేదే నిజం కాబోతోంద‌ని తెలుస్తోంది. ఉప ముఖ్య‌మంత్రి త‌ర్వాత క్యాబినెట్ లో కీల‌క ప‌ద‌వి ఏదంటే అది హోంశాఖ. అయితే ప్ర‌స్తుతం ఈ ప‌ద‌విని చేప‌డుతున్న నిమ్మకాయల చినరాజప్ప పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. 
 
గంతంలో  ఓ ప్ర‌ముక ఛాన‌ల్ కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో  చినరాజప్ప మాట్లాడుతూ... త‌న‌కు ఇద్ద‌రు శ‌త్ర‌వులు ఉన్నార‌ని, ఆ ఇద్ద‌రిలో ఒక‌డు పోయాడ‌ని, ఇంకొక‌డు ఉన్నాడ‌ని ఏక వ‌చ‌నంతో మాట్లాడి కొద్ది రోజుల పాటు వార్త‌ల్లో నిలిచారు. ఆ త‌ర్వాత నుంచి పెద్ద‌గా వార్త‌ల్లో క‌నిపించ‌లేదు చినరాజ‌ప్ప‌. ఇక తాజాగా ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నార‌నే వార్త బ‌య‌టికి రావ‌డంతో మ‌రోసారి రాజ‌ప్ప సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారారు. 
 
అయితే ఆయ‌న రాజీనామా చేయ‌డానికి ముఖ్య కార‌ణం టీడీపీ నాయ‌కులు అవ‌మానించ‌డ‌మే అని స‌న్నిహితులు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గతంలో క్యాబినెట్ మంత్రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆయ‌న గురించి ఇత‌ర మంత్రులు మాట్లాడార‌ట‌. ఒక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆ శాఖపై పట్టు ఏర్పరుచుకోవాలి కానీ, ఆయన పదవి చేపట్టి నాలుగేళ్లు కావ‌స్తున్నా ఇంత వ‌ర‌కు కూడా చినరాజ‌ప్ప‌కు ఆ శాఖ గురించి అసలు ఏం తెలియ‌ద‌ని ఇత‌ర మంత్రులు అనుకుంటుంటే ఆయ‌న విన్నార‌ట‌. దీంతో వారు అన్న మాట‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ద‌గ్గ‌ర తన గురించి ఇలా అస‌భ్య‌క‌రంగా మాట్లాడుకుంటున్నార‌ని, వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాజ‌ప్ప ఫిర్యాదు చేశార‌ట‌. 
 
కానీ చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి  చ‌ర్య‌లు తీసుకోలేద‌ట‌, పైగా ఇలాంటి  వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోకూడ‌ద‌ని ఆయ‌న‌కు సూచించార‌ట‌. ఇక వారిపై చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోకపోవ‌డంతో త‌న‌ను టీడీపీ అధిష్టానం చిన్న చూపు చూస్తుంద‌నే ఆవేద‌న‌తో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
ఒకవేళ ఆయ‌న రాజీనామా చేస్తే 2019 ఎన్నిక‌ల్లో పార్టీలో వ్య‌తిరేక‌త పెరుగుతుంది. న‌లుగురు మంత్రులు త‌న గురించి నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడుకుంటేనే స‌హించుకోలేని రాజ‌ప్ప. ఇక ఆయ‌న నియోజ‌కవ‌ర్గంలోని ప్ర‌జ‌లంతా ఇదే రీతిలో మాట్లాడుకుంటే టీడీపీలో ఉంటారా.. అని చాలా చోట్ల ప్ర‌శ్న‌గా మారింది. ఒకవేళ‌ ఆయ‌న టీడీపీకి గుడ్ బై చెప్తే ఏ పార్టీలో చేరుతార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌గా మారనుంది. 
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుత‌న్నాయి కాబ‌ట్టి ప్ర‌ధాన‌ ప్ర‌తిక్ష పార్టీ వైసీపీలో చేరుతారా లేక జ‌న‌సేన పార్టీలో చేరుతారా అన్న‌ది స‌స్పెన్స్ గా మారుతోంది. 2019 ఎన్నిక‌ల్లో వ‌స్తే మ‌ళ్లీ టీడీపీ అయినా అధికారంలోకి వ‌స్తుంది. లేక వైసీపీ అయినా అధికారంలోకి వ‌స్తుంది. కానీ జ‌న‌సేన పార్టీ మాత్రం అధికార‌లోకి మాత్రం రాదు సో చినరాజ‌ప్ప వైసీపీలో చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. చూద్దాం ఆయ‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తారా.. లేక సైలెంట్ గా ఉండి టీడీపీని దెబ్బ‌కొడుతారా అన్న‌ది ప్ర‌శ్న‌గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.