విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 13:08:42

విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు మాట‌ల తూటాలు అన్ని వెన‌క్కి వ‌స్తున్నాయి, కాని ప్ర‌తిప‌క్ష పార్టీకి బీజేపీ పై ఎటువంటి ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాయి..ముఖ్యంగా ఎటువంటి మాట మాట్లాడినా తెలుగుదేశం నాయ‌కులు మీడియాలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు. ఇక తెలుగుదేశం అధినేత ఆయన త‌న‌యుడు, మంత్రి నారాలోకేష్ పై కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక అవినీతికి ఏపీ కేరాఫ్ అడ్ర‌స్ అయింది అని మండిప‌డుతున్నారు బీజేపీ నాయ‌కులు, వైసీపీ నాయ‌కులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు  విజయసాయి రెడ్డి ఆరోపించారు
 
సీఎం అయిన‌ప్ప‌టి నుంచి  భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ తాను నిద్రపోనని అన్నారు. దేశంలోని హవాలా, విదేశాల్లోని ఆర్మ్‌డ్‌ డీలర్స్‌తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.
 
చంద్ర‌బాబు రాజ‌కీయాలు అంద‌రూ చూస్తున్నారు అని తిరుప‌తిలో చేస్తున్న‌ది ధర్మపోరాటదీక్ష కాదని, అదొక అధర్మ సభ అని విమ‌ర్శించారు రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయ‌సాయిరెడ్డి. ఇక కొండపైన బీజేపీతో టీడీపీ జట్టు కడుతూ.. కొండ కింద కుస్తీ పడుతోందన్నారు. బీజేపీతో చంద్ర‌బాబు ర‌హ‌స్య మంత‌నాలు చేస్తున్నారు అని అన్నారు.
 
చంద్ర‌బాబు త‌న‌పై ఢిల్లీలో చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని విజయసాయి చెప్పారు. ప్రతీ ఆరోపణకు తన వద్ద రుజువులు ఉన్నాయని తెలిపారు విజ‌య‌సాయిరెడ్డి. తాను ప్రధానిని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారనని ఆ విష‌యాలు తానే వెల్ల‌డిస్తాను అని తెలియ‌చేశారాయ‌న‌... తాను ప్రధానిని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. ప్రజా సమస్యల గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రధానని కలిశాను. అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తానని వెల్లడించారు.
 
చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రి మోదీకి  ఆధారాలను సమర్పిస్తానని చెప్పారు. అవినీతికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు. గత్యంతరం లేని స్థితిలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. అప్పటినుంచి ప్రతి క్షణం భయపడుతున్నారని అన్నారు... చంద్రబాబు, లోకేష్‌ చేసిన అవినీతే ఆ భయానికి కారణమని ఆరోపించారు. మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు చూస్తుంటే తెలుగుదేశం అధినేత వెన‌క‌డుగుల‌కు ఈ అవినీతి కార‌ణ‌మా అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.