ఆ ప‌ని చేస్తే 2019లో వైయ‌స్ జ‌గ‌నే సీఎం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan image
Updated:  2018-04-01 05:46:41

ఆ ప‌ని చేస్తే 2019లో వైయ‌స్ జ‌గ‌నే సీఎం

వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి రానంటే ప్ర‌జాసేవ చేయ‌డానికి అధికారం అవ‌స‌రం అని చెప్పారు  దివంగ‌త నేత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు. ఆ మాట విన్న వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌ప‌ళంగా రాజ‌కీయాల్లోకి అరంగెట్రం చేశారు. మొద‌ట క‌డ‌ప ఎంపీగా విజ‌యం సాధించిన జ‌గ‌న్ తండ్రి అకాల మ‌ర‌ణంతో జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా పులివెందుల‌కు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అధికారం లేక‌పోయినా త‌న‌వంతు బాద్య‌త‌గా  ప్ర‌జాసేవ చేయ‌డానికి కృషి చేస్తున్నారు.  
 
2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూత‌వేటు దూరంలో అధికారం కోల్పోయారు వైయ‌స్ జ‌గ‌న్‌. అప్ప‌టి నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కోసం ఎన్నో ఉద్యమాలు, దీక్షలు చేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ కేంద్రం పై నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తున్నారు.అదే స‌మ‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి ఏకంగా పాదయాత్ర కు స్వీకారం చుట్టారు వైయ‌స్ జ‌గ‌న్.ప్ర‌స్తుతం జరుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రాష్ట్రానికి హోదా ప్ర‌క‌టించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న కేంద్రం పై ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టారు.  పార్ల‌మెంట్ చివ‌రి రోజున హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయించి అదే రోజు నుంచి దిల్లీ ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే ఇన్ని చేస్తున్న జగన్ కి ఇంకొక పని చేస్తే మాత్రం ఖచ్చితంగా సిఎం అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. 2019 ఎన్నిక‌ల ముందున్నఅతి పెద్ద స‌వాల్ ఏదైనా ఉందంటే అది ప్ర‌త్యేక హోదా మాత్ర‌మే.
 
రాష్ట్రంలో ఎన్నో స‌మ‌స్య‌లున్నా వాట‌న్నింటినీ వ‌దిలి కేవ‌లం ప్ర‌త్యేక హోదా కావాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఉవ్విళ్లు ఊరుతున్నారు.రాష్ట్రాన్ని రెండుముక్క‌లుగా విభ‌జించి, విభ‌జ‌న చ‌ట్టాన్ని రూపొందించి, ప్ర‌త్యేక‌హోదాని హామీగా ప్ర‌క‌టించింది అప్ప‌టి పార్ల‌మెంట్‌.  ఆ హ‌మీల‌ను విస్మ‌రించిన‌  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. నాలుగేళ్లు పూర్తి అయిన‌ప్ప‌టికి ఆ హ‌మీల‌ను కూడా  నేర‌వేర్చ‌క‌పోవ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు కేంద్రం పై ఆగ్ర‌హంతో ఉన్నారు.
 
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సాధ‌నే ల‌క్ష్యంగా పోరాటం చేస్తున్న‌ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి అమ‌రావ‌తి న‌డిబొడ్డున ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగితే ఖ‌చ్ఛితంగా రాష్ట్రమంతా జ‌గ‌న్ వెంట నిల‌బ‌డ‌డానికి సిద్దంగా ఉంద‌ని అంటున్నారు.. కేంద్రం ప్ర‌క‌ట‌న చేసేంత వ‌ర‌కు జ‌గ‌న్ దీక్ష‌కు క‌ట్టుబ‌డి ఉంటే త‌ప్ప‌కుండా కేంద్రం దిగొస్తుంద‌ని అంటున్నారు.జ‌గ‌న్ సీఎం కావాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం ఇదొక్క‌టే అని అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆమ‌ర‌ణ నిరాహ‌ర‌ దీక్ష‌తో సాధించార‌ని వారు గుర్తు చేశారు. కాబ‌ట్టి ఖ‌చ్ఛితంగా జ‌గ‌న్ కొద్ది కాలంపాటు ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను ప‌క్క‌న‌పెట్టి ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే ప్ర‌త్యేక‌హోదా సాధించ‌డంతో పాటు, వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు కూడా ఆమ‌ర‌ణ దీక్ష దోహ‌ద‌ప‌డుతుందని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.