రాజీనామా చేస్తా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 15:50:16

రాజీనామా చేస్తా..?

నెల్లూరు జిల్లాలో త‌న ప‌రిపాల‌న‌తో ప్ర‌జ‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున జ‌నంలో ఉంటారు  నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి .. అయితే అంతే క‌క్ష‌తో ఆయ‌న పై అధికార పార్టీ వ్య‌వ‌హారిస్తోంది.. అధికార పార్టీ ఆయ‌న పై అనేక అభియోగాలు మోపుతూ నిరంత‌రం ఆయ‌న్ని ఇబ్బందులకు గురిచేస్తోంది అంటారు ఆయ‌న అభిమానులు, వైసీపీ నాయ‌కులు.
 
ఇక తాజాగా ఆయ‌న స‌ర్కారు వ్య‌వ‌హార‌తీరు పై , అలాగే తెలుగుదేశం నాయకుల పై ఫైర్ అయ్యారు.. ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాలి అని తెలుగుదేశం అనుకుంటోంద‌ని ఇది జ‌ర‌గ‌ని ప‌ని అని అన్నారు..  రాజకీయ కక్షతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను  అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే సహించేదిలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మండిపడ్డారు... క్రికెట్ బుకీలకు మద్దతుగా పోలీసులకు తాను ఫోన్ చేసివుంటే వాటి వివరాలు  బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు ఆయ‌న‌. 
 
తాను ఎవరికి ఫోన్ చేశానో ఆ అధికారుల పేర్లు ఎందుకు ఎస్పీ బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొందరు బుకీలు మంత్రులకు సన్మానాలు చేశారని, అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టారని, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని సూటిగా అడిగారు. త‌నకు ఈ విష‌యాల్లో ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు ఆయ‌న‌.
 
కృష్ణ సింగ్ అనే బుకీతో తాను విజయవాడలోని ఓ హోటల్, కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు చెబుతున్నారని, అలా ఉంటే సీసీ ఫుటేజీ బయట పెట్టండని అడిగారు. ఒకవేళ తాను ఉన్నట్లు నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. తెలుగుదేశం నాయ‌కులు, అధికారులు ఈ స‌వాల్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.