చిక్కుల్లో చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:12:51

చిక్కుల్లో చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు రాజ‌కీయంగా  ఎటు చూసినా ఉచ్చు బిగుస్తోంది... తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామ‌కంపై తీవ్ర స్థాయిలో అభ్యంత‌రాలు ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి... అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం ఏ మాత్రం న్యాయ బ‌ద్దంగా లేద‌ని వెంట‌నే టీటీడీ బోర్డు మెంబ‌ర్లుగా నియ‌మించిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అలాగే బొండా ఉమాల‌ను వెంట‌నే తొల‌గించాలని బ్రాహ్మ‌ణ సంఘాలు  నిర‌స‌న‌లు చేస్తున్నాయి... అయితే ఈ మేర‌కు అనితకు  సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
గ‌తంలో ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనిత ఏం చెప్పిందంటే?  నేను క్రిస్టియన్… ఇప్పటికీ నా బ్యాగ్‌లో… కారులో బైబిల్ ఉంటుంది… బైబిల్ లేకుండా బయటకు వెళ్లనని చెప్పుకొచ్చింది...అయితే  ఈ వీడియోను చూసిన   బ్రాహ్మ‌ణ‌ సంఘాలు త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు... ఇతర మతాలకు చెందిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ప్రభుత్వంపై త‌మ ఆగ్రహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు... వెంట‌నే చంద్ర‌బాబు టీటీడీ బోర్డు నియామ‌కంపై జోక్యం చేసుకుని అనిత‌ స్థానంలో హిందువుల‌కు సంబంధించిన వ్య‌క్తుల‌ను టీటీడీ బోర్డు స‌భ్యులుగా నియ‌మించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
 
దీంతో పాటు బోండా ఉమాను కూడా టీటీడీ బోర్డు స‌భ్యుడిగా తొల‌గించాల‌ని బ్రాహ్మ‌ణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి... ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ...బొండా ఉమా హిట్లర్ అని అత‌డిని టీటీడీ స‌భ్యుడిగా నియ‌మిస్తే తాము ఒప్పుకోమ‌ని,ఈ ప‌ద‌వికి బోండా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి... 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలవ‌డానికి  కారణం బ్రాహ్మణ సంఘాలే అని అన్నారు... కానీ ఆయ‌న  గెలిచినప్పటికి బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.