ఇన్ క‌మ్ టాక్స్ బెనిఫిట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 11:34:37

ఇన్ క‌మ్ టాక్స్ బెనిఫిట్స్

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో తెలుగు త‌మ్ముళ్లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ వెబ్ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందులో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఇన్ క‌మ్ ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం  లేద‌ని అంటున్న మాట‌ల‌ను తెలుగు త‌మ్ముళ్లు విప‌రీతమైన నెగిటీవ్ ప్ర‌చారం చేస్తున్నారు. 
 
అస‌లు వైయ‌స్ జ‌గ‌న్ చెప్పిన మాటల్లో తెలుగు త‌మ్ముళ్లు నిజాన్ని గ్ర‌హించలేని అజ్ఝాన స్ధితిలో ఉన్నారు.  బీకాంలో ఫిజిక్స్ చదివిన త‌మ్ముళ్లు  ముందు  ప్ర‌త్యేక హోదా రావ‌డం వ‌ల‌న వ‌చ్చే ఇన్ క‌మ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. నిజ‌మే.... వైస్ జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా హోదా వ‌స్తే ఇన్ క‌మ్ ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. 
 
అక్క‌డ జ‌గ‌న్ మాట్లాడింది కేవ‌లం ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న‌...  గ‌త ఎన్నిక‌ల నుండి హోదా కోసం వైకాపా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం హోదా వ‌స్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని, ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం వ‌ల‌న రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల‌కు ఉపాధి  అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని జ‌గ‌న్ పోరాడుతున్నారు. 
 
సో... హోదా వ‌స్తే  ఏపీలో ఏర్పాటు కానున్న ప‌రిశ్ర‌మ‌లు  ఇన్ క‌మ్ ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ప‌రిశ్ర‌మ‌లు అన్న విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి......వ్య‌క్తులు సంపాదిస్తున్న సొమ్ముకు ట్యాక్స్  క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదంటూ జ‌గ‌న్ అన్న‌ట్లుగా అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు ప‌చ్చ త‌మ్ముళ్లు.....ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ శున‌కానందం పొంద‌డం త‌మ్ముళ్ల‌కు మొద‌టి నుండి అల‌వాటే  క‌దా......జ‌గ‌న్ చెప్పింది నిజ‌మే అని చెప్ప‌డానికి ఈ కింద ఫోటో సాక్ష్యం త‌మ్ముళ్లు....tdp leaders

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.