జ‌గ‌న్ ఎంత మొండివాడో...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-30 15:00:13

జ‌గ‌న్ ఎంత మొండివాడో...

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నేటితో 177వ రోజుకు చేరుకుంది.గ‌డిచిన 176 రోజుల్లో జ‌గ‌న్ ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఎర్ర‌ని ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా పాద‌యాత్ర కొన‌సాగిస్తూ వ‌చ్చారు.ఇలా గ్యాప్ లేకుండా ప్ర‌తీ రోజు 15 కీలో మీట్ల‌మేర జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌డంతో ఆయ‌న‌కు కాస్త నీర‌సం వ‌చ్చిన‌ట్లు అయింది దీంతో వెంట‌నే డాక్ట‌ర్ల‌ను పిలిపించుకుని చికిత్స చేయించుకున్నారు.
 
డాక్ట‌ర్లు చికిత్స చేసిన త‌ర్వాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌చ్చితంగా వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల‌ని, ఎండ‌లో ప్ర‌తీ రోజు పాద‌యాత్ర చేయ‌డంతో ఆయ‌న‌కు వ‌డ‌దెబ్బ త‌గిలింద‌ని చికిత్స చేసిన వైద్యులు చెప్పారు.దాంతో నేత‌లు కూడా జ‌గ‌న్‌ను విశ్రాంతి తీసుకోవాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే గ‌తంలో కూడా జ‌గ‌న్ చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న‌పుడు వ‌డ‌దెబ్బ త‌గిలింది. 
 
అయితే అప్పుడు కూడా సేమ్ ఇలానే జ‌గ‌న్ ఇబ్బంది ప‌డ్డారు. కానీ పాద‌యాత్ర‌ను మాత్రం పోస్ట్ పోన్ చేయ‌లేదు. ఇక‌ ఇప్పుడు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను పోస్ట్ పోన్ చేయ‌కుండా క‌ష్ట‌త‌ర‌మైన స్థితిలో కూడా పాద‌యాత్ర చేస్తున్నారు. దాంతో జ‌గ‌న్ ఎంత మొండివాడో ఈ విష‌యం బ‌ట్టి అంద‌రికీ అర్ధ‌మ‌వుతోంది.
 
అయితే ప్ర‌స్తుతం ఈ పాద‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీవ‌వ‌రం నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ కు వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డంతో వైసీపీ అభిమానులు, ప్ర‌జ‌లు కార్య‌క‌ర్త‌లంద‌రూ ఆయ‌న ఆరోగ్యంగా ఉండాల‌ని వారి మ‌తాల దేవుళ్ల‌కు పూజ‌లు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.