రూటు మార్చిన నిఘా విభాగం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:13:11

రూటు మార్చిన నిఘా విభాగం ?

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర గుంటూరు జిల్లాలో అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ కు పెద్ద సంఖ్య‌లో జ‌న‌సందోహాం వ‌స్తున్నారు... జ‌గ‌న్ కు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. అలాగే వైసీపీ అధినేత స్పీచ్ కు ముగ్దుల‌వుతున్నారు ప్ర‌జ‌లు.. జ‌గ‌న్ స‌భ‌ల్లో మాట్లాడే మాట‌లు సైకిల్ పార్టీకి వేసే పంచులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.. ఇక తాజాగా నిఘా విభాగం జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై త‌మ స్ట్రాట‌జీని మార్చింది.. జ‌గ‌న్ పై కొత్త కొత్త విధానంలో ఏమి జ‌రుగుతోంది పార్టీ త‌ర‌పున అన్ని విష‌యాల‌ను తెలుసుకుంటోంది... అయితే నిఘా విభాగానికి చెందిన సీనియ‌ర్ అధికారి ఏమ‌న్నారంటే?
 
ఓ నిఘా అధికారి  ఆసక్తిగా మాట్లాడారు. తమ సమాచార సేకరణలోనూ మార్పు వచ్చిందని చెప్పారు. సంకల్పయాత్రలోనే జగన్‌ కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన గుర్తుచేశారు....ఇంతకాలం పాదయాత్రకు ఎంత మంది వచ్చారు? ఎవరు వచ్చారు? జగన్‌ ఏం మాట్లాడుతున్నారు? అని పైవాళ్లు మమ్మల్ని అడిగేవాళ్లు. ఇప్పుడు మాత్రం ‘వాట్‌ నెక్ట్స్‌?’ అని ప్రశ్నిస్తున్నారు.
 
ప్రతీ సభలోనూ జగన్‌ చెప్పే మాటల తీవ్రత ఎంత? జాతీయ, రాజకీయ పరిణామాలపై ఆయన కోణం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు’ అని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల ఆమరణ దీక్షకు పాదయాత్ర సభ నుంచే జగన్‌ పిలుపునిచ్చారు. ఇది రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. అప్పటి నుంచి ప్రభుత్వం నిఘా బృందాలను పెంచినట్టు సమాచారం. జగన్‌ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఓ సైన్యమే సిద్ధమవుతోందని వారు అభిప్రాయపడడం విశేషం. ఇక్క‌డ జ‌గ‌న్ కు సోష‌ల్ మీడియా త‌ర‌పున ఉన్న సైన్యం, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయ‌కుడికి లేదు అని చెప్ప‌వ‌చ్చు అని అంటున్నారు అధికారులు.

షేర్ :

Comments

1 Comment

  1. Yes

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.