విజ‌య‌సాయి రెడ్డి పై నిఘా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 15:02:52

విజ‌య‌సాయి రెడ్డి పై నిఘా...

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర్వాత పార్టీలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ నాయ‌కుడు ఎంపి విజ‌య‌సాయి రెడ్డి. వైయ‌స్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ వ‌చ్చిన ఆయ‌న వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణంతో జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల వ‌ల్ల వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి అండ‌గా ఉండ‌డానికి క్రీయాశీల‌క రాజ‌కీయాల్లోకి అరంగేట్రం చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ పార్టీ తీసుకున్న ప్ర‌తీ నిర్ణ‌యంలోను విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌మేయం ఉంది అంటే అందులో అతిశ‌యోక్తి లేదు..
 
గత కొన్ని రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి.... ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ‌ పార్టీలు కేంద్రం పై పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక‌హోదా కోసం మొద‌టి నుంచి పోరాటం చేస్తోంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్ర‌త్యేక‌హోదా కోసం దిల్లీలో జ‌రుగుతున్న పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ, దిల్లీలో పార్టీ అభ్యున్న‌తికి కృషి చేస్తున్నారు.. అదే విధంగా వైసీపీ పై టీడీపీ నాయ‌కులు చేసే అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా స‌మాధానాల ఇస్తున్నారు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. అదే విధంగా టీడీపీలో జ‌రిగే అంత‌ర్గ‌త విష‌యాల‌ను సైతం బ‌హిర్గ‌తం చేస్తుండ‌డంతో  టీడీపీ అండ్ కో ప్ర‌త్యేకించి ఆయ‌న‌ పై నిఘా వేసి దృష్టిసారించింది.
 
కేంద్రం పై అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.... ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార  శైలి పై ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మీడియాతో  మాట్లాడుతుండ‌గా ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వచ్చి మీడియా వ్యక్తిలా నిలబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన విజయసాయిరెడ్డి సదరు అధికారికి స్ట్రాంగ్  కౌంటర్ ఇచ్చారు. మీరు ఇంటెలిజెన్స్ అధికారి అన్న విషయం మాకు తెలుసు. మీడియా సమావేశంలో మీకు పని లేదు. మీరు ఇక వెళ్లవచ్చు అని చెప్పారు. అంతేకాదే ఏదైనా స‌మాధానం కావాల్సి ఉంటే నన్ను నేరుగా ప్ర‌శ్నించు నేను స‌మాధానం చెబుతా అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దీంతో మీడియా కూడా అత‌ని వైపు చూసింది.
 
రాజ్య‌స‌భ‌ ఎంపీగా  విజ‌య‌సాయి రెడ్డి ఢిల్లీకి వెళ్లిన తర్వాత‌ టీడీపీ లాబీయింగ్‌ పనిచేయడం లేదన్న అభిప్రాయం ఉంది. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను, అవినీతిని జాతీయ నేతలకు విజయసాయిరెడ్డి వివరిస్తున్నారన్న అనుమానం కూడా టీడీపీలో పెరిగిపోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కొనుగోలులో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని కూడా విజయసాయిరెడ్డి ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టుగా ఉంది  ఏపీ ప్రభుత్వం. అధికార టీడీపీని ఎదుర్కోవ‌డంలోను, దిల్లీ స్థాయిలో టీడీపీని బ‌ల‌హీన ప‌రుస్తున్నాద‌న్న భ‌యంతోనే విజ‌య‌స‌సాయి రెడ్డి పై ప్ర‌త్యేకించి నిఘా పెట్టిన‌ట్లు స‌మాచారం.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.