పాద‌యాత్రపై ఇంటిలిజెన్స్ క‌న్ను

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 12:18:56

పాద‌యాత్రపై ఇంటిలిజెన్స్ క‌న్ను

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజా సంక‌ల్ప యాత్ర అశేష జనవాహిని మధ్య జరుగుతుంది.. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, వాళ్లకు నేనున్నాను అనే భరోసాను ఇస్తూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 
ఇది ఇలా ఉంటే ప్రజా సంకల్పయాత్ర ఇప్పటికే 8 జిల్లాలను పూర్తి చేసుకున్న కూడా జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది.అందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర‌ మినిట్ టూ మినిట్ అప్ డేట్స్ ను తెలుసుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్రైవేట్ ఇంటలిజెన్స్ వర్గాలను ఉపయోగించుకుంటుందని సమాచారం. ఈ ప్రైవేట్ ఇంటలిజెన్స్ జగన్ పాదయాత్రపై సీక్రెట్ గా నిఘా పెట్టి, జగన్ పాదయాత్ర కదలికలను తెలుసుకుంటున్నారు.
 
అంతే కాదు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఇంత మంది జనం ఎందుకు వస్తున్నారు, జగన్ పై అభిమానంతో వస్తున్నారా లేక టీడీపీ ప్రభుత్వం పై వ్యతిరేకతతో వస్తున్నారా అనేది ప్రైవేట్ ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నారని సమాచారం. జగన్ హామీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు...జగన్ వేసే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ముందుగానే తెలుసుకునేందుకు ప్రైవేట్ ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రయతిస్తున్నట్లు సమాచారం.
 
ప్ర‌జ‌లు జ‌గ‌న్ తో ఏ స‌మ‌స్య‌ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, జగన్ వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఏ ఏ నాయకులు జగన్ ని కలుస్తున్నారు లాంటి అనేక విష‌యాలపై ప్రైవేట్ ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తున్నాయి. ఇలా జగన్ వేసే ప్రతి అడుగుని గమనిస్తున్నారు ప్రైవేట్ ఇంటిలిజెన్స్.
 
టీడీపీ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతతో, రాష్ట్రంలో జరుగుతున్నా అవినీతితో, మహిళలపై హత్యచారాలు, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో, ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఒకే మాటపై ఉండడం చూసి, జగన్ పైన ఉన్న అభిమానంతో, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ది పొందిన వారు, ఇలా అనేక కారణాల వల్ల జగన్ పాదయత్రకి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు టీడీపీ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.