అనంత టీడీపీలో క‌ల్లోలం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

war in tdp
Updated:  2018-04-02 05:29:47

అనంత టీడీపీలో క‌ల్లోలం

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు హ‌యాం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట‌గా ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే...ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాకు బీట‌లు వాలుతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో 14 సెగ్మెంట్ల‌లో 12 స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.. అయితే ప్ర‌స్తుతం ఈ జిల్లాలో వున్న తెలుగుదేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య  ఉన్న వ‌ర్గ విభేదాలు తారా స్థాయికి చేరు కోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 8 నుంచి 10 స్థానాల‌కు పైగా వైసీపీ అసెంబ్లీ సీట్ల‌ను కైసం చేసుకుంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
 
ఇటీవ‌లే తాడిప‌త్రి నియోజ‌క వ‌ర్గంలో జేసీ ప్రభాక‌ర్ రెడ్డికి అత‌ని అనుచ‌రుల‌కు వ‌ర్గ విభేదాలు త‌లెత్త‌డంతో, అక్క‌డ  రెండు వ‌ర్గాలుగా విడిపోయి వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే... అయితే ఇదే త‌రుణంలోనే రాయ‌దుర్గం కు  చేందిన టీడీపీ నాయ‌కుల మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి..కాగా  ఇదే వ‌ర్గ‌పోరు సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ కొన‌సాగితే కంచుకోట బ‌ద్ద‌లు కావ‌డం ఖాయం అని విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
దీనికి తోడు వైయ‌స్సార్ సీపీ  అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న సంక‌ల్ప‌యాత్ర‌తో అనంత‌పురం జిల్లాలోకి అడుగు పెట్టడంతో టీడీపీ బీట‌ల‌కు మ‌రింత బీట‌లు నేరుగా క‌నిపించాయి..ఆయ‌న రాక‌తో  టీడీపీ కంచుకోట రాజ‌కీయాలు తారుమారు అయ్యాయ‌ని అంటున్నారు... పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత‌లు సైతం టీడీపీ వ్య‌వ‌హార శైలిప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.. ఎప్ప‌టి నుంచో పార్టీ భాద్య‌త‌ల‌ను మోస్తున్న వారికి ఇంత వ‌ర‌కూ  ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌కుండా సైకిల్ పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు అని...... త‌మ కంటే మొన్న‌టికిమొన్న పార్టీలోకి ఫిరాయించిన నాయ‌కుల‌కే  ప‌ద‌వులు, బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్నారే త‌ప్ప టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు మాత్రం ఆ గుర్తింపు ఇవ్వ‌ట్లేద‌ని  లోలోప‌ల కుమిలి పోతున్నారు.
 
ఇక తాజాగా అనంతపురంలో కూడా వ‌ర్గ‌పోరుతో  తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీలో నెలకొన్న అసమ్మతి బహిర్గతమైంది.. ఈ సమావేశంలో వ‌చ్చేసార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో మైనార్టీ అభ్యర్థికి అనంతపురం అసెంబ్లీ టికెట్ కేటాయించాలంటూ కొందరు బాహాటంగానే లేవనెత్తారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.