రాంపుల్లారెడ్డి కౌంట‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

av subba reddy and akhila priya
Updated:  2018-04-24 12:57:44

రాంపుల్లారెడ్డి కౌంట‌ర్ ?

ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయం భూమా నాగిరెడ్డి ఉన్నంత సేపు ఎంత చ‌ర్చ‌కు వ‌చ్చిందో ఇప్పుడు ఆయ‌న లేక‌పోయినా అంత‌కు రెంట్టింపు చ‌ర్చ‌కు వ‌స్తోంది.. రాంపుల్లారెడ్డి వ‌ర్గీయులతో భూమా ఫ్యామిలీకి పొస‌గ‌దు, రాజ‌కీయంగా ఇక్క‌డ గంగుల కుటుంబానికి భూమా కుటుంబానికి కూడా వైరాలు ఉన్నాయి..అయితే రాజ‌కీయంగా భూమా పైచేయి సాధించి అధికార బ‌లంతో ఇక్క‌డ రాజ‌కీయాలు చేసేవారు..అయితే భూమా నాగిరెడ్డికి వెన్నంటి ఉండే ఏవీ కూడా వీరి వ‌ర్గాల‌కు వైరి అయ్యారు. ఇక ఏవీ అంటే ఆ వ‌ర్గాల‌కు కూడా శ‌త్రువు లెక్కే.
 
అయితే నాగిరెడ్డి త‌ర్వాత మంత్రి అఖిల ప్రియ ఏవీకి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం భూమా కేడ‌ర్ రెండుగా చీల‌డంతో ఇప్పుడు ఇక్క‌డ పొలిటిక‌ల్ వార్ మ‌రింత ముదురుతోంది... వైరి వ‌ర్గాల‌కు వీరి ఇద్ద‌రూ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు అనేది ఇటీవ‌ల వీరి గొడ‌వ‌ల‌తో క‌రెక్ట్ అనిపిస్తోంది.. ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌లు కూడా ఇదే చ‌ర్చించుకుంటున్నారు.
 
ఇక తాజాగా నియోజకవర్గంలో టీడీపీని బతికించాలని ఆ పార్టీ మాజీ ఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి అన్నారు. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయన్నారు. వీరిద్దరు తమ వ్యక్తి గత ఇమేజ్‌లను కాపాడుకోవడానికి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వచ్చారని అన్నారు. ఈ విషయాన్నింటిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానన్నారు. 
 
సీఎం చెప్పాడంటూ వీరిద్దరు పోటాపోటీగా నిరాహార దీక్షలు చేపట్టి ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్‌ కూడా రాదన్నారు. వీరిద్దరి సమస్య పరిష్కరించాలన్నారు. ఇందుకోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి లేక జిల్లా అధ్యక్షుడు జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. ఇక గ‌తంలో రాంపుల్లారెడ్డికి  కాంట్రాక్ట్ ఇప్పించిన విష‌యంలో, తెలంగాణ‌కు చెందిన  ఓ కాంట్రాక్ట‌ర్ పై భూమా ఏవీ మాట్లాడిన ఫోన్ సంభాష‌ణ‌లు లీకై ఏపీలో హాల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.