చంద్రబాబు టాంపరింగ్ చేశారా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-06-13 05:19:27

చంద్రబాబు టాంపరింగ్ చేశారా?

చంద్రబాబు కి 2019 ఎన్నికల భయం పట్టుకుందా..? సొంత సర్వేలలో టీడీపీకి ఎదురు గాలి వీస్తున్నదా..? జగన్ కి పాదయాత్ర లో వస్తున్న ఆదరణ చూసి బాబు కి ఓటమి తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.1995 నుండి ఏ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసే సాహసం చేయని  చంద్రబాబు ఇపుడు కొత్తగా ఓటమి భయం తో కొత్త రాగం అందిపుచ్చుకుంటున్నారు అదే బీజేపీ ఈవీఎంల మానేజ్మెంట్.
 
ఓటమి భయం తో అన్న సమాధానం సుస్పస్టం కాకపోతే ఇక్కడ గమనించిన విషయం ఒకటి ఉంది అదేంటి అంటే "అడుక్కు తిని తీసుకొస్తే సగం సగం కుక్క కరిస్తే మాత్రం నాకు సంబంధం లేదుష‌ ఈ సామెత ఎపుడైనా విని ఉంటే పర్వాలేదు వినని రీడర్స్ కోసం ఒకసారి మరల దాని అర్దం తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం రోజుల్లో ఇద్దరు బిచ్చగాళ్ల మిత్రులుగా ఉండే వారట. 
 
వారిలో ఒకరోజు ఒకరికి జ్వరం వస్తే రెండో బిచ్చగాడు అయ్యో నా మిత్రుడికి జ్వరం వచ్చింది తను బయటకి వెళ్లే అవకాశం లేదు కనుక తన ఆకలి బాధని ఎలా అయినా తీర్చాలి అని సంకల్పించి మిత్రమా మరేమి దిగులు లేదు నీకు జ్వరంగా ఉంది కదా ఇవాళ నీ తరుపున కూడా నేనే అడుక్కుని నీ ఆకలి బాధని నేను తీరుస్తా అన్నాడు అట. అపుడు వెంటనే జ్వరం తో ఉన్న బిచ్చగాడు ఆరోగ్యంగా ఉన్న బిచ్చగాడితో మిత్రమా నువ్వు నా తరుపున అడుక్కుని తీసుకువస్తే పర్లేదు వచ్చిన దానిలో సగం సగం పంచుకుందాం కానీ వీధిలో ఉన్న కుక్క కరిస్తే మాత్రం నాకు సంబంధం లేదు అన్నాడు అట స్వార్ధపరుడైన ఆ రెండో బిచ్చగాడు.
 
ఇక్కడ ఈ కథలో 2014లో జ్వరం తో ఉన్న ఆ పసుపు పచ్చ బిచ్చగాడు ఎవరో ఈపాటికే మీకు అర్దం అయి ఉంటది ఇక స్నేహానికి అర్దం తెలియని ఈ పసుపు పచ్చ బిచ్చగాడు తన తన స్నేహితుడు తన మంచి సంకల్పించి 2014న తన CM పదవి అనే ఆకలిని తీర్చినా.. (పాము ఎలా అయితే పాలు పోసిన కాటు వేయడం మరువదో) ..తన గుణాన్ని మాత్రం మళ్లీ నిస్సిగ్గుగా పాత్రికేయుల ముఖంగా అవలంబించే ధోరణి సాహసం చేయగలిగాడు. 
 
ఒక వేళ బీజేపీ కి కనుక ఈవీఎంల మానేజ్మెంట్ తెలిసి ఉంటే 2004 సాధారణ ఎలక్షన్స్ లో బీజేపీ ఓడి ఉండేదా ? మొన్నటికి మొన్న కర్ణాటక ఎలక్షన్స్ లో మిగిలిన‌ ఆ 8 మంది MLA కూడా గెలిపించుకునేది కదా .ఇవన్నీ చేయని బీజేపీ ఒక్క 2019 ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ మాత్రం ఈవీఎం మానేజ్మెంట్ చేస్తుంది అంటే నమ్మాలా ? లేక చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది అని అనాలా..?
 
పోనీ ఇవన్నీ పక్కన పెడితే 2014 సాధారణ ఎలక్షన్స్ లో ఆంధ్రరాష్ట్రంలో బీజేపీ తో చేతులు కలిపి చావు తప్పి కన్ను లొట్ట పోయింది అన్న‌ చందాన గెలిచినా చంద్రబాబు కూడా ఈవీఎం మానేజ్మెంట్ చేశారా అంటే అబ్బే అదేం లేదండి మా బాబు బంగారం అంటున్నాయి మన ఎల్లో కుల మీడియా...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.