మాగంటి ఎంపీ టికెట్ ఆయ‌న‌కు ఫిక్స్ అయిందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 11:47:52

మాగంటి ఎంపీ టికెట్ ఆయ‌న‌కు ఫిక్స్ అయిందా

ప‌శ్చిమ గోదావరి జిల్లాలో పాగ వేస్తే చాలు క‌చ్చితంగా అధికారం ద‌క్కించుకోవ‌చ్చు అన్న‌సెంటిమెంట్ దాదాపు అన్ని పార్టీల్లో ఉంది. అందుకే గోదావ‌రి జిల్లాల్లో ప‌ట్టుకోసం ఎలాంటి నిర్ణాయాలు అయినా అమ‌లు చేయ‌డానికి రాజ‌కీయ నాయ‌కులు వేన‌కడుగు వేయ‌కున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నిసీట్ల‌ను త‌మ ఆదీనంలో తెచ్చుకునేందుకు వైసీపీ అన్ని విధాలుగా అస్త్రాల‌ను వ‌దులుతోందట‌. 
 
 
ఇక మ‌రోవైపు అధికార తెలుగుదేశంపార్టీ నాయ‌కులు కూడా ఇప్ప‌టినుంచే మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు పార్ల‌మెంట్ సీటును కొత్త‌వారికి కేటాయించే ఆలోచ‌న చేస్తుంద‌ట టీడీపీ అధిష్టానం. ప్ర‌స్తుతం ఏలురు సిట్టంగ్ ఎంపీగా ఉన్న మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావుపై పార్టీ నేత‌లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ట‌. అలాగే ఏలూరు పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వ‌చ్చే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌ల‌తో మాగంటి బాబుకు పొస‌గ‌టం లేద‌ట‌.
 
 దీంతో ఎంపీగా మ‌రో అభ్య‌ర్థిని రంగంలో దించేందుకు పావులు క‌దుపుతోంద‌ట అధికార‌పక్షం.