సైకిల్ కు ఐదు సెగ్మెంట్లలో ఫిరాయింపుల పోరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 12:12:45

సైకిల్ కు ఐదు సెగ్మెంట్లలో ఫిరాయింపుల పోరు

తెలుగుదేశం కంచుకోట, బంగార‌పు పూత అని చెప్పుకునే జిల్లా ప్ర‌కాశం జిల్లా.. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ గెలిచిన  విజ‌యాలు ఇక్క‌డ తెలుగుదేశానికి కంటి మీద కునుకులేకుండా చేశాయి.. రాజ‌కీయంగా ప్ర‌కాశంలో కాంగ్రెస్ కూడా గ‌తంలో చ‌క్రం తిప్పింది, ఎన్టీఆర్ ఉన్న స‌మ‌యంలో పార్టీ ఓ విధంగా ఇక్క‌డ ఎదిగినా త‌ర్వాత ప‌లుకార‌ణాల‌తో నాయ‌కులు ఇటు వేరే పార్టీల్లో మారిపోయారు..
 
తొమ్మిదేళ్ల బాబు పాల‌న‌కు ఇప్పుడుజ‌రుగుతున్న బాబు పాల‌న‌కు నాయ‌కుల ఆలోచ‌న విధానం కూడా టీడీపీ పై మారింది. గెలిస్తే మంత్రి ఓడి పోతే ఎమ్మెల్సీ ఇచ్చి త‌న కోట‌రినీ వెనుక ఉంచుకున్నారు అనే విమర్శ వినిపిస్తోంది.. త‌మ‌ని ముందు సంప్ర‌దించ‌కుండా ఫిరాయింపుల‌ను కూడా పార్టీలో చేర్చుకున్నారు అనే విష‌యంలో వార్ మొద‌లైంది కూడా ఇక్క‌డ నుంచే.
 
ఇక ప్ర‌కాశం జిల్లాలో రెండు పార్టీలు నువ్వా నేనా అనే రేంజ్ లో పొలిటిక‌ల్ వార్ కు రెడీ అయ్యాయి... ఫిరాయింపుల లొల్లి త‌గ్గినా అధికార పార్టీలో వ‌ర్గ‌పోరు మాత్రం హీట్ పెట్టిస్తోంది.. ఇటు నాయ‌కుల మ‌ధ్య వివాదాల‌కు జిల్లా నాయ‌కులతో బాబు స‌ర్దిచెబుతున్నా, జిల్లా ఇంచార్జ్  ల మాట కూడా లెక్క చేయ‌డం లేదు.. మ‌రోప‌క్క వ‌ర్గ‌పోరుకు పార్టీలో ప‌ద‌వులు ఇచ్చినా ఆధిప‌త్య వివాదాలు పేట్రేగిపోతున్నాయి.
 
ఇటు ఉత్త‌ర‌కోస్తా ద‌క్షిణ కోస్తాలో ప్ర‌కాశం రాజ‌కీయాల గురించి అంద‌రూ చ‌ర్చించుకుంటారు....ఎందుకు అంటే 12 సెగ్మెంట్ల‌లో కేవ‌లం మూడు సెగ్మెంట్లు మినహా ఇక్క‌డ అధికార పార్టీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.
 
2014 ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని చూస్తే ఆరు సీట్లు వైసీపీ, ఐదు సీట్లు టీడీపీ గెలుపొందాయి.. అలాగే చీరాల‌లో  నవోదయం పార్టీ అభ్యర్థి  ఆమంచి కృష్ణ‌మోహ‌న్ గెలుపొందారు. ఇక వైసీపీ త‌ర‌పున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల‌లో గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే,కందుకూరు ఎమ్మెల్యే కూడా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించారు..
 
ఇక ఇండిపెండెంట్ గా గెలిచిన ఆమంచి కూడా టీడీపీ వైపు వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ ఐదు సెగ్మెంట్ల‌లో టీడీపీ నాయ‌కులకు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది..అంతే కాదు ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు సీటు ఎవ‌రికి ఇస్తారా అనే ఆలోచ‌న‌తో మ‌రింత చ‌ర్చ జ‌రుగుతోంది పార్టీలో..అందుకే అధికార పార్టీ ఈ వ్య‌వ‌హారానికి చెక్ పెట్టేందుకు త్వ‌ర‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నార‌ట బాబు, మ‌రి ఇక‌నైనా ఈ అంశానికి పుల్ స్టాప్ ప‌డుతుందా లేదా చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.