తోపులాట‌లో ముక్క‌లైన జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy
Updated:  2018-07-13 06:34:42

తోపులాట‌లో ముక్క‌లైన జేసీ

ఏపీ అధికార‌ తెలుగుదేశం పార్టీ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అంటే రాష్ట్రంలో తెలియ‌ని వారంటూ ఎవ్వ‌రు ఉండ‌రు. ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు. నాకు పీఎం అయినా సీఎం అయినా డోంట్ కేర్ త‌ప్పుచేస్తే ఎవ‌రినైనా దండిస్తా, నాకు అడ్డువ‌స్తే దేనికైనా సిద్ద‌ప‌డ‌తా అన్న నినాదంతో జేసీ ముందుకు పోతున్నారు. 
 
అయితే తాజాగా టీడీపీ కంచుకోట అనంత‌పురం జిల్లాలో రైతులు ఏర్ప‌టు చేసి స‌మావేశంలో జేసీ త‌న వాక్చాతుర్యాన్ని పెంచేశారు. ఈ స‌భ‌కు హ‌జ‌రైన వామ‌ప‌క్ష సీపీఐ,సీపీఎం నాయ‌కుల‌ను ఉద్దేవించి మాట్లాడి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు జేసీ. తాను రాజ‌కీచ‌య అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన‌ప్పుడు వామ‌ప‌క్షాలు మంచి నాయ‌కుల‌ని బావించాన‌ని, కానీ వారుకూడా దొంగ‌లే అని జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక త‌మ పార్టీని నాయ‌కులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వెంట‌నే క్ష‌మాప‌న చెప్పాల‌ని వామ‌ప‌క్ష‌నేత‌లు జిల్లా వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. క్ష‌మాప‌న చెప్ప‌క‌పోతే వ‌చ్చేఎన్నిక‌ల్లో జేసీకి త‌గిన బుద్దిచెబుతామ‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోపారి గుత్తిలో ప‌ట్ట‌నంలో వామ‌ప‌క్షాలు ద‌ర్నాను చేట్టారు. విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత నుంచి ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కోసం నిరంత‌రం పోరాడుతున్నామ‌ని వారు గుర్తుచేశారు. 
 
అయితే ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక్క సారి కూడా విభ‌జ‌న చ‌ట్టంలో పోందుపరిచిన అంశాల‌కు పోరాడ‌లేద‌ని వారు మండిప‌డ్డారు. పైగా తాము పోరాడుతుంటే వామ‌ప‌క్షాల నాయ‌కులు దొంగ‌లు అంటార‌ని వారు వాపోతున్నారు. అందుకే నేడు జేసీకి వ్య‌తిరేకంగా దిష్టిబొమ్మ‌ను  దగ్ధం చేసేందుకు కమ్యూనిస్టు శ్రేణులు ప్ర‌యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ తోపులాట‌లో జేసీ దిష్టి బొమ్మ ముక్క‌లు ముక్క‌లు అయిపోయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.