ఉత్త‌రాంధ్రలో ముదిరిన వ‌ర్గపోరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-22 05:21:03

ఉత్త‌రాంధ్రలో ముదిరిన వ‌ర్గపోరు

శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అందులో శ్రీకాకుళం, ఆమ‌దాల‌వ‌రుస, పాత‌ప‌ట్నం, న‌ర్స‌న్న‌పేట‌, టెక్క‌లి, ప‌లాసా, ఇచ్చాపురం, ఈ ఏడు అసెంబ్లీ స్థానాలు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో ఉన్నాయి. ఇక మిగిలిన‌ ఎచ్చెర్ల, రాజాం, విజ‌య‌న‌గ‌రం పార్ల‌యెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని, పాల‌కొండ అర‌కు పార్ల‌మెంట్ నియోజ‌క‌ర్గంలో ఉన్నాయి. దీంతో శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలోని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇత‌ర పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు మ‌ధ్య స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ విభ‌జ‌న క‌నిపిస్తుంది. 
 
శ్రీకాకుళం పార్ల‌మెంట్ స్థానానిక సుదీర్ఘ‌కాలం నాటినుంచి కింజ‌ర‌పు కుటుంబం ప్రాతినిధ్యం వ‌హిస్తు వ‌స్తున్నారు. దీంతో శ్రీక‌కుళం పార్ల‌మెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కింజ‌రపు కుటుంబం ఆధిప‌త్యం సాగిస్తోంది. ఇక మ‌రో వైపు ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్ కాగా రాజాం సెగ్మెంట్ ఎస్సీ రిజ‌ర్వుడు. ఇక పాల‌కొండ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రి క‌ళావెంక‌ట‌రావు ఆధిప‌త్యం క‌న‌ప‌డుతోంది. 
 
పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ రేఖ‌లు ఉన్న‌టికి గ‌తంలో జ‌రిగిన ప‌రిస్థితిలు ఇప్పుడు టీడీపీని వెంటాడుతున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఈ జిల్లా నుంచి కింజ‌ర‌పు కుటుంబానికి చెందిన అచ్చెన్నాయిడుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చి క‌ళా వెంక‌ట‌రావుని రెండున్న‌రెళ్లు ప‌క్క‌న పెట్టారు. ఈ నేప‌థ్యంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు క‌ళావెంక‌ట‌రావుకు ప‌ట్టువున్న ఎచ్చెర్ల‌, రాజాం, పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొంద‌రిని చేర‌దీసి ప్రత్యేక వ‌ర్గాన్ని త‌యారు చేసుకున్నారు.
 
రాజాంలో ప్ర‌తిభా భార‌తి,ఎచ్చెర్ల‌లో చైర్ ప‌ర్స‌న్ ధ‌ర‌ల‌క్ష్మీ, అలాగే పాల‌కొండ‌లో పార్టీ ఇంచార్జ్ జ‌య కృష్ణలు మంత్రి అచ్చెన్నాయిడు వ‌ర్గానికి టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే కళా వెంక‌ట‌రావుకు మంత్రి ప‌ద‌విరావ‌డంతో అక్క‌డి ప‌రిస్థితి మారింది. దీంతో త‌న‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అచ్చెన్నాయుడు వ‌ర్గానికి చెక్ పెట్ట‌డం ప్రారంభించారు మంత్ర క‌ళా. 
 
త‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో అచ్చెన్నాయుడు సిఫారస్సుల‌ను తొక్కిపెట్ట‌డం మొద‌లు పెట్టార‌ట‌. దీంతో ఇరు వ‌ర్గాల‌మ‌ధ్య‌ రాజ‌కీయ ర‌గ‌డ రాజుకుని ప్ర‌త్యేక ఆరోప‌ణ‌ల‌కు తెర తీసిన‌ట్లు అయింది. రాజాంలో ప్ర‌తిభా భార‌తి వ్య‌తిరేకంగా క‌ళా వెంక‌ట‌రావు వ‌ర్గం అస‌మ్మ‌తి స‌మావేశం ఏర్పాటు చేయ‌గా దీనికి పోటీగా ప్ర‌తిభా భార‌తి కూడా ఓ స‌మావేశం ఏర్పాటు చేశారు. దీంతో వీరిద్ద‌రిమ‌ధ్య  ఆధిప‌త్య‌పోరు ఇంకా ముదిరింది.

షేర్ :

Comments

0 Comment