టీడీపీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 18:28:52

టీడీపీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అధికార బ‌లంతో వారు ఎంత‌మేర‌కు అవినీతికి పాల్పడ్డారో వాట‌న్నింటిని టీడీపీ నాయ‌కులు బ‌హిరంగంగానే తెలియ జేస్తున్నారు. అందులో క‌ర్నూల్ జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ నాయ‌కుల వ్య‌వ‌హారం తారా స్థాయికి చేరుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులు ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా కూడా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటు రెండు వ‌ర్గాలుగా విడిపోతున్నారు.
 
గతంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేసించారు. ఆయ‌న ఆదేశాల‌ మేర‌కు ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్ మినీ మ‌హానాడు స‌భ‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ స‌భ‌లో టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకున్నసంగ‌తి తెలిసిందే.
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రోసారి స‌భా ముఖంగా ఆలూరులోని టీడీపీ నాయ‌కులు రెచ్చిపోయారు. ఈ సంద‌ర్బంగా టీడీపీ నాయ‌కుడు వైకుంఠ మ‌ళ్లికార్జున్ మాట్లాడుతూ, అధికార బ‌లంతో ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్ విచ్చ‌ల‌విడిగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ, నీరు-చెట్టు కింద అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అంతేకాదు ఎన్టీఆర్ హౌస్ ప‌థ‌కం కింద ప్ర‌తీ ఇంటికి 15 వేల రూపాయ‌ల‌ను అలాగే అంగన్‌ వాడీ వర్కర్ల ద‌గ్గ‌ర నుంచి రూ.5 లక్షలు అక్ర‌మంగా వ‌సూలు చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు వాపోయారు.  ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో వీరభద్రగౌడ్ చేస్తున్న అవినీతిపై టీడీపీ స‌ర్కార్ వెంట‌నే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని వారు డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.