ఆ సీటు కోసం ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు ఢీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-06 17:02:39

ఆ సీటు కోసం ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు ఢీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కర్నూల్ జిల్లా అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇటు టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి, అటు టీజీ వెంక‌టేష్ కుమారుడు టీజీ భ‌ర‌త్ కూడా పోటీ చేసేందుకు ఢీ అంటే ఢీ అంటున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూల్ అర్భ‌న్ నుంచి తానే పోటీ చేస్తాన‌ని అందుకు చిన‌బాబు కూడా ఓకే చెప్పార‌ని ఇక మ‌రోవైపు ఎస్వీ ప్ర‌చారం చేస్తున్నారు. లేదు..లేదు ప్ర‌తీ ఎన్నిక‌ల‌కు ఈ సెగ్మెంట్ లో స‌ర్వేని నిర్వ‌హించి ఎవ‌రికి ప‌ట్టు ఉందో వారినే నిల‌బెడుతార‌ని సో మా ఫ్యామిలీకే ఎక్కువ బ‌లం ఉంద‌ని భ‌ర‌త్ అంటున్నారు.
 
అందుకోస‌మే ప్ర‌తీ రోజు భ‌రత్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న గ్రామాల‌కు తిరిగి బూత్ క‌మిటీల‌తో స‌మావేశం అవుతున్నారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌ధానంగా త‌న తండ్రి టీజీ వెంక‌టేష్ హయాంలో ఎలాంటి అభివృద్ది జ‌రిగిందో వాట‌న్నింటిన ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
అలాగే ఎవ‌రికి సీటు ద‌క్కుతుంది అన్న‌దానిపై కూడా భ‌రత్ క్లారిటీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎస్వీ మోహ‌న్ రెడ్డి అనుచ‌రుల‌ను ఆక‌ర్షించే విధంగా అనేక ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నార‌ట‌ భ‌ర‌త్. ఒకవేళ త‌న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సీటు కేటాయించక‌పోతే రెబ‌ల్ గా అయినా దిగి క‌ర్నూల్లో పోటీ చేస్తాన‌ని భ‌ర‌త్ త‌న అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో త‌న బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు వార్డుల వారిగ తిరిగి త‌న‌కు మ‌ద్ద‌తు తేలిపేందుకు వ‌చ్చిన వారి పేర్ల‌ను వార్డుల వారిగా సేక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
ఇక ఈ విష‌యాల‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఎస్వీ త‌న అనుచ‌రుల‌లో టీజీ భ‌రత్ కు పోటీగా కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయి విస్రృత స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. క‌ర్నూల్ జిల్లాలో తానే పోటీ చేస్తాన‌ని ఈ విష‌యాన్ని మంత్రి లోకేశ్ ఆల్రెడీ ప్ర‌క‌టించార‌ని ఇందులో ఎలాంటి మార్పు లేద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు ఎస్వీ. మొత్తానికి అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు మ‌ధ్య బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంద‌నే చెప్పాలి. ఇక మ‌రోవైపు ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌ధాన ప‌ట్టుకొమ్మ‌గా ఉన్న మైనార్టీ ఓట్ల‌ను ఫోక‌స్ చేసి త‌న వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నంలో ప‌డింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.